యూఏఈలో ఘనంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
- September 01, 2024
యూఏఈ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు యూఏఈలో అజ్మాన్ మైత్రి ఫామ్ జనసేన పార్టీ కార్యాలయం నందు గల్ఫ్ సేన జనసేన పార్టీ జాతీయ ఇంచార్జి సరి త్రిమూర్తులు మరియు జాతీయ కన్వినర్లు ఎం.చంద్రశేఖర్,సి.హెచ్.రాందాస్ ఆధ్వర్యంలో కార్యనిర్వాహక సభ్యుల పర్యవేక్షణ లో వైభవంగా జరిగింది చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శన ఆటపాటలతో కార్యక్రమం ప్రారంభం చేసారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిలుగా సుందరపు విజయ్ కుమార్ (MLA యలమంచిలి ),బొమ్మిడి నాయకర్ (MLA నర్సాపురం)రాయపాటి అరుణ(జనసేన పార్టీ అధికార ప్రతినిధి) కోన తాతారావు (గాజువాక ఇంచార్జ్) రాయపురెడ్డి కృష్ణ(మాడుగుల ఇంచార్జ్)విచ్చేసారు.ఈ కార్యక్రమంలో భాగంగా గల్ఫ్ జనసేన యూఏఈ జనసేన పార్టీ బలోపేతానికి మరియు విజయానికి కీలక పాత్ర పోషించింది అని గల్ఫ్ సేన జన సేన ఎన్నో సేవకార్యక్రమాలు అలాగే నా సేనకు-నావంతు భాగంలో కోటి రూపాయలు విరాళంతో పాటు ఆరు దేశాలను ఒక తాటి పై తీసుకొచ్చి పార్టీ విజయనికి ఎంతో శ్రమించారాని అతిధిలు కొనియాడారు మరియు వారి చేతులు మీదుగా కమిటీ సభ్యులకు చిరు సత్కార సన్మానంతో అభినందినిచారు.
ఇందులో భాగంగా దేశం లోనే కని విని ఎరుగని రీతిలో 100% స్ట్రైక్ రేట్ తో విజయం సాధించటానికి ఎన్నో అటుపోటులను తట్టుకుని గెలుపొంది ఈ కార్యక్రమంనకు ముఖ్య అతిధులు గా విచ్చేసిన నాయకులకు జాతీయ మరియు ప్రాంతీయ కార్యదర్సులు, కార్యనిర్వాహక సభ్యులు మరియు జనసేన వీరమహిళలు వారికి చిరు సన్మాన సత్కారలతో అభినంద కృతజ్ఞతలు తెలియజేశారు.కరోనా కు ముందు దుబాయ్ నుండి విశాఖపట్నం కు ఫ్లైట్ ఉండేది అది తొలగించిన కారణంగా తిరిగి ఈ సౌకర్యాన్ని కల్పించాలని దుబాయ్/షార్జా ట్రావెల్స్ ఫోర్మ్ చైర్మన్ శరత్ యలమర్తి వినతి పత్రంను అందజేశారు.ఈ జన్మదిన వేడుకలు కార్యక్రమంనకు జనసేన కార్యకర్తలు, జన సైనికులు, వీరమహిళలు అలాగే కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు పెద్దఎత్తున్న వైసిపి నుండీ కార్యకర్త లు జనసేన పార్టీ లో వారి సమక్షంలో చేరడం జరిగింది.
యూఏఈ ప్రబుత్వం వీసా లేకుండ అక్రమంగా ఉంటున్న వారి కోసం యూఏఈ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన (ఆమ్నెస్టీ) కార్యక్రమం కోసం NDA ప్రభుత్వం & భారత కాన్సులేట్ జనరల్ వారి సహకారం తో టిక్కెట్టు కూడా కొనుకోలేని స్థితిలో ఉన్న ప్రవాస బారతీయులను తిరిగి స్వదేశానికి పంపించడానికి సహాయం సహకారాలు అందించాలని గల్ఫ్ జనసేన ఇంచార్జీ త్రిమూర్తులు కోరడం జరిగింది.ఈ సభలో అనేక మంది వక్తలు ప్రశంగించడం జరిగింది.
అనంతరం గౌరవ అతిధులు మాట్లాడుతూ తుగ్లక్ పాలను పారద్రోలి, రాష్ట్రంలో NDA ప్రభుత్వం ఏర్పాటు లో NRI ల పాత్ర కీలకం అని కొనియాడారు,ఎటువంటి సహాయం సహకారాలు అందించదానికి ప్రతి NRI కి మేము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
అనంతరం జన సైనికులు వీర మహిళలు,అతిదులు సమక్షములో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా కేకు cut చేసి ఘనంగా పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..