ఖతార్ లో ఘనంగా నందమూరి బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ వేడుకలు...

- September 01, 2024 , by Maagulf
ఖతార్ లో ఘనంగా నందమూరి బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ వేడుకలు...

దోహా: ఖతార్ లో నందమూరి బాలకృష్ణ గోల్డెన్ జూబిలీ సంబరాలు--పెద్దసంఖ్యలో పాలుపంచుకున్న అభిమానులు.. తెలుగుదేశం పార్టీ నాయుకులు, శ్రేణులు.

ఖతార్ లో నందమూరి బాలకృష్ణ గోల్డెన్ జూబిలీ సంబరాలను ప్రవాసులు ఘనంగా నిర్వహించుకున్నారు. అయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయుకులు, శ్రేణులు భారీగా హాజరై, కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొన్నారు.గోల్డెన్ జూబిలీ పోస్టర్స్ ను  వివిధ ప్రదేశాల్లో ప్రదర్శించారు.ఈ సందర్భంగా బాలకృష్ణ సినీ రంగానికి చేసిన సేవను, యాభై వసంతాలుగా ప్రేక్షకులకు అయన పంచిన వినోదాన్ని.. అలరించిన తీరుతన్నులను, పోషించిన ఎన్నో వైరుధ్యమైన పాత్రలను గుర్తుచేసుకొన్నారు. 1974 లో తాతమ్మకల చిత్రంతో,14 ఏళ్ళ ప్రాయంలో ప్రారంభమైన ఆయన సినీ ప్రస్థానం, ఎన్నో సాంఘీక, జానపద, పౌరాణిక పాత్రలతో తెలుగు ప్రేక్షకుల మనసుని గెలుచుకొని, తన తండ్రి.. తెలుగువారి ఆరాధ్యదైవం, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, తారకరాముడికి  నటవారసుడిగా చెరగని ముద్రవేసుకొన్నారని కొనియాడారు. కొన్ని కొన్ని పురాణ పాత్రలు ఆయనకోసమే పుట్టాయా.. అనేవిధంగా.. ఆపాత్రలలో ఆయన పరకాయప్రవేశం చేసారని, భైరవదీపం సినిమాలో కురూపి వేషం, ఆదిత్య 369 లాంటి సినిమాలు, మంగమ్మ గారి మనవడు, మువ్వా గోపాలుడు, ముద్దుల మావయ్య, నారీనారీ నడుమ మురారి, లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, బంగారు బుల్లోడు, సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, లక్ష్మినరసింహ, సింహ, లెజెండ్, అఖండ లాంటి చిత్రాలలో ఆయన నటన అనితర సాధ్యం అని ప్రశంచించారు. 

ఫిలింఫేర్ అవార్డ్స్  సౌత్ నుంచి, బెస్ట్ ఆక్టర్ గా.. మువ్వా గోపాలుడు, ఆదిత్య 369,నరసింహ నాయుడు, సింహ, శ్రీ రామ రాజ్యం, గౌతమీపుత్ర శాతకర్ణి, భగవంత్ కేసరి కి దక్కాయి.. ఇక ఎన్నో నంది అవార్డ్స్, ఇతర అవార్డ్స్ ఆయనను వరించాయిఅని చెప్పుకొచ్చారు.     
బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్  ఇన్స్టిట్యూట్ కోసం ఆయన చేస్తున్న కృషిని కొనియాడారు.. ప్రపంచమంతా తిరిగి, బెస్ట్ అఫ్ ది బెస్ట్ డాక్టర్స్ ని తెచ్చి పేదవాడి ప్రాణాలను కాన్సర్ మహమ్మారి నుంచి కాపాడుతున్న మహోన్నతుడు అని ప్రశంచించారు. 

రాజకీయ రంగానికి సైతం నేనున్నాని పేదలకు పెన్నిధిగా... బడుగు బలహీన పక్షపాతిగా వారికీ యెన్నుదండుగా ఉంది చేస్తున్న సేవలు కీర్తించారు.ఈ కార్యక్రమాన్ని పెద్దఎత్తున్న ఘనవిజయం చేయుటలో కీలక భూమిక పోషించిన  గొట్టిపాటి రమణయ్య, మల్లిరెడ్డి సత్యనారాయణ, రమేష్ దాసరి, శాంతయ్య యరమంచిలి, రజని, మరియు ఇతర నాయకులను,అభిమానులను అభినందించారు.డైమండ్  జూబిలీ సంబరాలు కూడా ప్రపంచ వ్యాప్తంగా చేసుకోవాలని..ఆయన త్రండ్రి మరియు భగవంతుని ఆశీర్వాదం ఆయనకు మెండుగా ఉండాలని కోరుకొంటూ... జై బాలయ్య నినాదాలతో.. కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com