బాలకృష్ణ నట స్వర్ణోత్సవ వేడుకలకు మెగాస్టార్..
- September 01, 2024
హైదరాబాద్: బాలకృష్ణ సినీ పరిశ్రమలోకి వచ్చి 50 పూర్తయిన సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమ గ్రాండ్ గా సెలబ్రేషన్స్ నిర్వహిస్తుంది. 1974లో తాతమ్మ కల సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు బాలయ్య. 50 ఏళ్ళ తన నట ప్రస్థానం పూర్తవడంతో అన్ని సినీ పరిశ్రమల నుంచి స్టార్స్ ని పిలిచి ఈవెంట్ గ్రాండ్ గా చేస్తున్నారు.
బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకల ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. చిరంజీవి బాలకృష్ణని హత్తుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఇద్దరూ ఈవెంట్లో పక్కపక్కనే కూర్చుకున్నారు. ఇండస్ట్రీ సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ ఇలా కలిసి ఒకేచోట కనపడటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి అయ్యప్ప మాలలో రావడం గమనార్హం.
అలాగే చిరంజీవితో పాటు ఈ ఈవెంట్ కి వెంకటేష్, శ్రీకాంత్, నాని, కన్నడ స్టార్ హీరోలు శివన్న, ఉపేంద్ర, మన సినీ పరిశ్రమ నుంచి ఎంతోమంది నటీనటులు, డైరెక్టర్స్ విచ్చేసారు.ఈ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరుగుతుంది. ప్రస్తుతం ఈ ఈవెంట్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..