అబుదాబిలో ప్రారంభమైన ఐఐటీ-ఢిల్లీ.. అబుదాబి క్రౌన్ ప్రిన్స్ హాజరు..!
- September 03, 2024
యూఏఈ: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ అబుదాబి (IIT-ఢిల్లీ అబుదాబి) ప్రారంభోత్సవానికి అబుదాబి క్రౌన్ ప్రిన్స్, అబుదాబి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ హెచ్.హెచ్. షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ హాజరయ్యారు.IIT-ఢిల్లీ, ఖలీఫా విశ్వవిద్యాలయం, మొహమ్మద్ బిన్ జాయెద్ యూనివర్శిటీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సోర్బోన్ విశ్వవిద్యాలయంతో సహా ఎమిరేట్‌లోని ప్రతిష్టాత్మక ఉన్నత విద్యా సంస్థల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంతో IIT-ఢిల్లీ అబుదాబిని ప్రారంభించారు. ముఖ్యంగా ఖలీఫా యూనివర్శిటీతో కలిసి పరిశోధన, విద్యా కార్యక్రమాలలో IIT ఢిల్లీ అబుదాబి భాగస్వామ్యం కుదుర్చుకుంది. సోర్బోన్ యూనివర్శిటీ అబుదాబితో కలిసి ఉమ్మడి పరిశోధన ప్రాజెక్ట్‌లలో పాల్గొంటుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో సెమినార్‌లను నిర్వహించనుంది. మొహమ్మద్ బిన్ జాయెద్ యూనివర్శిటీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కలిసి సీడ్ ప్రాజెక్ట్ గ్రాంట్ల కేటాయింపు, ఉమ్మడి టీచింగ్ మరియు షార్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లలో సహకారం అందించుకోనున్నాయి. ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లను హోస్ట్ చేయనున్నారు.
ప్రారంభోత్సవం అనంతరం షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ క్యాంపస్‌ను పరిశీలించారు. అండర్ గ్రాడ్యుయేట్ ఎనర్జీ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (BTech) ప్రోగ్రామ్‌లతో సహా ఇన్‌స్టిట్యూట్ అందించే విభిన్న యూఏఈ అధునాతన విద్యా పర్యావరణ వ్యవస్థ పోటీతత్వాన్ని ప్రతిబింబిస్తుందని, R&Dలో గ్లోబల్ హబ్‌గా ఎమిరేట్‌ని అభివృద్ధి చేయడం, కీలక రంగాలలో జాతీయ ప్రతిభను నిరంతరం మెరుగుపరిచేందుకు దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యుఎఇలోని భారత రాయబారి సంజయ్ సుధీర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ డైరెక్టర్ ప్రొఫెసర్ రంగన్ బెనర్జీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ అబుదాబి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ శంతను రాయ్ పాల్గొన్నారు.
ఐఐటీ అబుదాబి క్యాంపస్‌ను ఏర్పాటు చేయడానికి అబుదాబి విద్య మరియు నాలెడ్జ్ డిపార్ట్‌మెంట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ, భారత విద్యా మంత్రిత్వ శాఖ మధ్య జరిగిన ఒప్పందాన్ని ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్,భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో జూలై 2023లో కురుర్చుకున్నారు. ఈ భాగస్వామ్యం యూఏఈ-ఇండియా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సిఇపిఎ)లో భాగంగా జరిగింది.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..