హైదరాబాద్- విజయవాడ సూపర్‌ఫాస్ట్ రైలు
- June 18, 2016
ఉద్యోగులకు ప్రత్యేక రైలు- 14 బోగీలు, ఒకటే స్టాప్- ఐదున్నర గంటల్లో గమ్యం సాక్షి, విజయవాడ: హైదరాబాద్, విజయవాడ మధ్య రైల్వే శాఖ సూపర్‌ఫాస్ట్ రైలును ప్రవేశపెడుతోంది. ఈ రైలును విజయవాడలో 20వ తేది రాత్రి 8.30 గంటలకు రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రారంభిస్తారని రైల్వే ఏసీఎం రాజశేఖర్ శనివారం విలేకరులకు తెలిపారు. ఈ రైలు వెలగపూడిలోని తాత్కాలిక రాజధానికి తరలివెళ్లే ఉద్యోగుల పనివేళలకు అనుకూలంగా ఉంటుంది. విజయవాడ రాజధాని ప్రాంతం కావడంతో ఉద్యోగులకు, ఇతర ప్రయాణికులకు ఈ రైలు వేళలు సౌకర్యవంతంగా ఉంటాయి. ఈ రైలులో హైదరాబాద్ నుంచి విజయవాడకు ఐదున్నర గంటల్లోనే చేరుకోవచ్చు.
గుంటూరులో ఒకటే స్టాప్.. విజయవాడ-సికింద్రాబాద్ (నెం: 12795) రైలు ప్రతిరోజు సాయంత్రం 5.30 గంటలకు విజయవాడలో బయలుదేరి, సాయంత్రం 6.20 గంటలకు గుంటూరుకు, రాత్రి 11.10 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. సికింద్రాబాద్-విజయవాడ (నెం: 12796) రైలు ప్రతి రోజూ ఉదయం 5.30 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి 10.08 గంటలకు గుంటూరుకు, 11 గంటలకు విజయవాడ చేరుతుంది. ఈ రైలు గుంటూరులో రెండు నిమిషాలు మాత్రమే ఆగుతుంది. వారంలో ఆదివారం మినహా మిగతా 6 రోజులు ఈ రైలు నడుస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. ఇందులో మొత్తం 14 బోగీలు ఉండగా.. రెండు ఎస్ఎల్ఆర్, రెండు ఏసీ చైర్‌కార్, 10 సీటింగ్ ఉంటాయి. ఉదయం పూట నడిచే రైళ్లు కావడంతో బెర్త్‌లు ఉండవు. మొత్తం రైలంతా సీటింగే ఉంటుందని రాజశేఖర్ తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







