క్షమాభిక్ష.. ఓవర్‌స్టేయర్‌ల రెసిడెన్సీ స్టేటస్‌.. GDRFA కీలక సూచనలు..!

- September 04, 2024 , by Maagulf
క్షమాభిక్ష.. ఓవర్‌స్టేయర్‌ల రెసిడెన్సీ స్టేటస్‌.. GDRFA కీలక సూచనలు..!

యూఏఈ: యూఏఈలో ఓవర్‌స్టేయర్‌లు తమ రెసిడెన్సీ స్టేటస్‌ని క్రమబద్ధీకరించుకోవాలనుకునేవారు,  దేశంలో నివాసం కొనసాగించాలని కోరుకునే వారు మానవ వనరుల మంత్రిత్వ శాఖ నుండి వర్క్ పర్మిట్‌ను సమర్పించాల్సి ఉంటుందని దుబాయ్‌లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) డైరెక్టర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మర్రి స్పష్టం చేశారు. క్రమబద్ధీకరణ ప్రక్రియలో ఈ డాక్యుమెంట్ కీలకమన్నారు. యూఏఈలో నివాసం కొనసాగించాలనుకునే ప్రవాసులు తమ రెసిడెన్సీ స్థితిని చట్టబద్ధం చేయడానికి వారి దరఖాస్తులో భాగంగా చెల్లుబాటు అయ్యే MoHRE వర్క్ పర్మిట్‌ను సమర్పించాలని సూచించారు. దాని స్థానంలో కంపెనీ ఆఫర్ లెటర్ ప్రామాణికమైన పత్రం కాదని అల్ మర్రి అన్నారు.  వర్క్ పర్మిట్ వ్యక్తి ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడని, యూఏఈ ఆర్థిక వ్యవస్థకు సహకరిస్తున్నాడని చూపిస్తుందని స్పష్టం చేశారు.  క్షమాభిక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే ప్రవాసులు తమ స్టేటస్‌ను క్రమబద్ధీకరించుకోవడానికి సంబంధిత కేంద్రాలను సంప్రదించే ముందు వర్క్ పర్మిట్‌తో సహా అవసరమైన అన్ని డాక్యుమెంటేషన్‌లను సేకరించవలసిందిగా సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com