వేతన నిబంధనల ఉల్లంఘన..57,398 ప్రైవేట్ సంస్థలకు నోటీసులు

- September 05, 2024 , by Maagulf
వేతన నిబంధనల ఉల్లంఘన..57,398 ప్రైవేట్ సంస్థలకు నోటీసులు

మస్కట్: కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన వేతన రక్షణ వ్యవస్థ (డబ్ల్యుపిఎస్)కు 2023, జూలై 9తో ఒక సంవత్సరం పూర్తయింది. ప్రైవేట్ రంగ సంస్థలు కొత్త నిబంధనలను అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యస్థ ప్రధాన సంస్థలు 9 నవంబర్ 2023 నాటికి 50% , 9 జనవరి 2024 నాటికి 100% నిబద్ధత సాధించడానికి ఆరు నెలల వ్యవధిని ఇచ్చారు. అదే విధంగా చిన్న మరియు చిన్న సంస్థలకు 50% సాధించడానికి 9 జనవరి 2024, 9 మార్చి 2024న 100 % అమలు చేసేందుకు ఇచ్చిన గడువు ముగిసింది.  

అమలు చేయకపోతే కార్మిక అనుమతుల జారీని నిలిపివేయడం,  OMR50 అడ్మినిస్ట్రేటివ్  పెనాల్టీని మంత్రిత్వ శాఖ విధించింది. 10 జనవరి నుండి 20 ఆగస్టు వరకు 57,398 సంస్థలకు నోటీసులు అందించింది  ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, జనరల్ ఫెడరేషన్ ఆఫ్ ఒమన్ వర్కర్స్, అథారిటీ ఫర్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ డెవలప్‌మెంట్ (ASMED), సంబంధిత ఇతర సంఘాల సహకారంతో మంత్రిత్వ శాఖ తన ఉద్యోగులు మరియు సనాద్ కార్యాలయాలు / కేంద్రాలకు వివిధ గవర్నరేట్‌లలో అవగాహన వర్క్‌షాప్‌లను నిర్వహించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com