దుబాయ్ సఫారీ పార్క్.. అక్టోబర్ 1నుండి సరికొత్త ఆవిష్కరణలతో ప్రారంభం..!
- September 09, 2024
యూఏఈ: దుబాయ్ సఫారీ పార్క్ తన ఆరవ సీజన్ అక్టోబర్ 1న ప్రారంభం కానున్నది. కొత్త ఆకర్షణలపై మరిన్ని వివరాలను రాబోయే రోజుల్లో ప్రకటిస్తామని దుబాయ్ మునిసిపాలిటీ తెలిపింది. పబ్లిక్ పార్కుల డైరెక్టర్ అహ్మద్ అల్ జరౌనీ మాట్లాడుతూ..తమ కొత్త సీజన్ ప్రారంభం దుబాయ్ సందర్శకులకు వన్యప్రాణులను పూర్తిగా ఆస్వాదించే అవకాశాన్ని కల్పిస్తుందన్నారు. తద్వారా పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి దుబాయ్ చేస్తున్న ప్రయత్నాలలో ఇది సరికొత్తకొత్త అధ్యాయాన్ని సూచిస్తుందన్నారు.
ప్రతి జోన్ వివిధ రకాల వన్యప్రాణులతో క్లోజ్-అప్ ఎన్కౌంటర్లను అందిస్తుందని, జంతు సంక్షేమం పరిరక్షణ ప్రయత్నాలను హైలైట్ చేసారు. నిపుణులైన జంతుశాస్త్రజ్ఞుల పర్యవేక్షణలో జంతు ప్రపంచంలోని అద్భుతాలను ఆకర్షణీయంగా ఆవిష్కరించనున్నారు. దుబాయ్ సఫారీ పార్క్లో 78 జాతుల జంతువులు, 111 రకాల పక్షులు సహా దాదాపు 3,000 పైగా జంతువులు ఉన్నాయి. ఇదిలా ఉండగా, గ్లోబల్ విలేజ్ తన 29వ సీజన్ అక్టోబర్ 16న ప్రారంభమవుతుందని, మే 11, 2025 వరకు కొనసాగుతుందని ప్రకటించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …