కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. 5కు చేరిన మృతుల సంఖ్య
- September 10, 2024
డెహ్రాడూన్: కేదార్‌నాథ్ మార్గంలో సోమవారం కొండచరియలు విరిగిపడ్డ విషయం తెలిసిందే. ఆ ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య అయిదుగురికి చేరుకున్నది. ఇవాళ ఉదయం మరో నలుగురి మృతదేహాలను శిథిలాల నుంచి వెలికి తీశారు. శిథిలాల కింద ఇంకా అనేక మంది యాత్రికులు ఉంటారని రుద్రప్రయాగ్ పోలీసులు భావిస్తున్నారు. కేదారీశ్వరుడిని దర్శనం చేసుకుని వెనక్కి వస్తున్న భక్తులు.. సోమవారం రాత్రి 7.30 నిమిషాలకు విరిగిపడ్డ కొండచరియల్లో చిక్కుకుని ఉంటారని అంచనా వేస్తున్నారు.
ఎస్డీఆర్ఎఫ్, ఎన్‌డీఆర్ఎఫ్ దళాలు తక్షణమే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. వెదర్ సరిగా లేకపోవడం వల్ల సోమవారం రాత్రి రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేశారు. రాత్రంతా అక్కడ రాళ్లు పడుతూనే ఉన్నాయి. మృతుల్లో ఎక్కువ శాతం మధ్యప్రదేశ్ వాసులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాణ నష్టం పట్ల సీఎం పుష్కర్ సింగ్ థామీ సంతాపం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







