ఈ పుకారుతో మార్మోగిపోతున్న సోషల్ మీడియా..

- September 10, 2024 , by Maagulf
ఈ పుకారుతో మార్మోగిపోతున్న సోషల్ మీడియా..

ఏంటి రజినీకాంత్ తన కూతురికి ఆ విడాకులు తీసుకున్న హీరోతో పెళ్లి చేయాలనుకుంటున్నారా.. ఇంతకీ ఆ హీరో ఎవరు.. కోలీవుడ్ వైరల్ అవుతున్న ఈ వార్త నిజమేనా అనేది ఇప్పుడు చూద్దాం..

రజినీకాంత్ కి ఇద్దరు కూతుర్లు.. అందులో మొదటి కూతురు ఐశ్వర్య రెండో కూతురు సౌందర్య. ఇందులో ఐశ్వర్య ధనుష్ ని పెళ్లి చేసుకుని 18ఏళ్లు కాపురం చేసి ఆ తర్వాత విడాకులు తీసుకుంది.

ఇక సౌందర్య కూడా మొదట వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చేసి తర్వాత మరో వ్యక్తిని పెళ్ళాడింది. అయితే తాజాగా రజినీకాంత్ తన పెద్ద కూతురు ఐశ్వర్య కి ఆ విడాకులు తీసుకున్న హీరోతో పెళ్లి చేయాలని చూస్తున్నట్టు కోలీవుడ్ మీడియా లో టాక్.ఇక అసలు విషయం ఏమిటంటే.. తాజాగా జయం రవి విడాకులు తీసుకున్నారు. అయితే ఈయన విడాకులు అనౌన్స్ చేసి కనీసం 24 గంటలు కూడా పూర్తి అవ్వలేదు.

అప్పుడే రెండో పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి. అదేంటంటే రజినీకాంత్ కూతురు ఐశ్వర్య ని జయం రవి రెండో పెళ్లి చేసుకుంటారని కోలీవుడ్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. దానికి కారణం ఐశ్వర్యకి విడాకులు అయ్యాయి అలాగే జయం రవి కూడా విడాకులు తీసుకున్నారు. అయితే గతంలో రజినీకాంత్ ఐశ్వర్యని రవి కిచ్చి వివాహం చేయాలనుకున్నారట.

కానీ అప్పటికే ఆయన వేరే అమ్మాయితో ప్రేమలో ఉన్నారని తెలిసి సైలెంట్ అయ్యారట.అయితే ఈ సీక్రెట్ విషయాన్ని సబితా జోసెఫ్ అనే జర్నలిస్టు బయట పెట్టారు.అయితే ప్రస్తుతం జయం రవి విడాకులు తీసుకోవడంతో ఆ జర్నలిస్ట్ చెప్పిన మాటలు ఇప్పుడు మీడియాలో వైరల్ చేస్తూ ఇద్దరు విడాకులు తీసుకున్నారు కాబట్టి రజినీకాంత్ వీరిద్దరికి రెండో పెళ్లి చేస్తారు కావచ్చు అంటూ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com