12 ఏళ్ల తర్వాత ఆ దేశంలో ఎంబసీ ప్రారంభించిన సౌదీ..!
- September 11, 2024
డమాస్కస్: సిరియా రాజధాని డమాస్కస్‌లో 12 సంవత్సరాల క్రితం సిరియా సంక్షోభం ప్రారంభమైనప్పటి నుండి మూసివేసిన తన రాయబార కార్యాలయాన్ని సౌదీ అరేబియా తిరిగి ప్రారంభించింది. సిరియాలోని సౌదీ ఛార్జ్ డి అఫైర్స్ యాక్టింగ్ అబ్దుల్లా అల్-హరీస్ అధికారికంగా ఎంబసీని ప్రారంభించారు. రెండు దేశాల మధ్య సంబంధాల చరిత్రలో ఇది ఒక ముఖ్యమైన ఘట్టంగా అల్-హరీస్ అభివర్ణించారు ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఇది కీలక ముందడుగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిరియా విదేశాంగ వ్యవహారాల మంత్రి అయ్యమన్ రాద్ మాట్లాడుతూ.. ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా.. ఈ చర్య ద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం అవుతాయన్నారు. ఈ ఏడాది మేలో సిరియాలో సౌదీ రాయబారిగా ఫైసల్ బిన్ సౌద్ అల్-ముజ్ఫెల్ను నియమించారు. సిరియా కూడా సౌదీ అరేబియాకు కొత్త రాయబారిగా డాక్టర్ ముహమ్మద్ సౌసాన్ను నియమించింది. ఈ ఏడాది జనవరిలో డాక్టర్ సౌసాన్ రియాద్‌లో బాధ్యతలు స్వీకరించారు. అక్టోబర్ 2023లో తమ దౌత్య కార్యకలాపాలను పునఃప్రారంభించాలనే నిర్ణయాన్ని సౌదీ అరేబియా, సిరియా ప్రకటించాయి.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







