బహ్రెయిన్ లో గార్బేజ్ బ్యాగుల కొరత.. తీవ్ర ఆందోళనలు..!!
- September 11, 2024
మనామా: ఉత్తర గవర్నరేట్‌లో గార్బేజ్ బ్యాగుల కొరత కొనసాగుతోందని నార్తర్న్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడు అబ్దుల్లా అల్ ఖుబైసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మూడు వారాలుగా నివాసితుల నుండి తనకు అనేక ఫిర్యాదులు అందాయని అల్ ఖుబైసీ తెలిపారు. తాను మంత్రిత్వ శాఖను సంప్రదించానని, కానీ వారు సమస్య గురించి తమకు తెలియదని చెప్పారని అల్ ఖుబైసీ తెలిపారు. ఈ సందర్భంగా గార్బేజ్ బ్యాగుల పంపిణీపై మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ తన ప్రణాళికలను వెల్లడించానలి అల్ ఖుబైసీ డిమాండ్ చేసారు. 2020 నుండి సమస్య కొనసాగడం "అవమానకరం" అని పేర్కొన్నారు.
నార్తర్న్ గవర్నరేట్‌లో గార్బేజ్ బ్యాగుల పంపిణీ చేయడానికి ఆటోమేటెడ్ మెషీన్‌లను ఉపయోగించడాన్ని అల్ ఖుబైసీ విమర్శించాడు. ఈ యంత్రాలు తరచూ పనిచేయక పోవడంతో ప్రజలు బ్యాగుల కోసం మున్సిపాలిటీ కార్యాలయాలకు వెళ్లాల్సి వస్తోందని వివరించారు. సమస్యను పరిష్కరించడానికి, తగినన్ని రిజర్వ్ బ్యాగులను అందించాలని అల్ ఖుబైసీ కోరారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..