పటాకుల తయారీ.. అమ్మకాలపై ఢిల్లీ ప్రభుత్వం బ్యాన్
- September 11, 2024
న్యూ ఢిల్లీ: రాబోయే వింటర్ సీజన్ ను దృష్టిలో ఉంచుకొని ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని నగరంలో కాలుష్య నియంత్రణే లక్ష్యంగా పటాకుల తయారీ, అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిషేధం వచ్చే ఏడాది జనవరి 1 వరకు అమలులో ఉంటుందని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ వెల్లడించారు. ఆన్లైన్లో క్రాకర్స్ అమ్మకం, డెలివరీలకూ ఈ నిషేధం వర్తిస్తుందని తెలిపారు. ఈ నిషేధాన్ని కఠినంగా అమలుచేసేందుకు ఢిల్లీ పోలీస్, పొల్యూషన్ కంట్రోల్ కమిటీ, రెవెన్యూశాఖల కో ఆర్డినేషన్ తో యాక్షన్ ప్లాన్ రెడీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ ను కంట్రోల్ చేయడమే లక్ష్యంగా నిర్దేశించుకున్న 21 ఫోకస్ పాయింట్ల ఆధారంగా పటాకుల తయారీ, అమ్మకాలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..