ఖతార్‌లో 8 రిక్రూట్‌మెంట్ కార్యాలయాలు మూసివేత..!!

- September 12, 2024 , by Maagulf
ఖతార్‌లో 8 రిక్రూట్‌మెంట్ కార్యాలయాలు మూసివేత..!!

దోహా: ఖతార్‌లోని రిక్రూట్‌మెంట్ కార్యాలయాలపై కార్మిక మంత్రిత్వ శాఖ కొరడా ఝులిపించింది. నిబంధనలు పాటించని ఎనిమిది రిక్రూట్‌మెంట్ కార్యాలయాలను అధికారికంగా మూసివేసినట్లు ప్రకటించింది. నిబంధనల ఉల్లంఘన,  ఫిర్యాదులను పరిష్కరించడంలో విఫలం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.  మూడు లైసెన్స్ లేని ఉమ్రా కార్యాలయాలను కూడా సీజ్ చేసుకున్నట్లు ప్రకటించింది.

మూసివేసిన రిక్రూట్‌మెంట్ సంస్థల జాబితా: రీజెన్సీ మ్యాన్‌పవర్ రిక్రూట్‌మెంట్, మహద్ మ్యాన్‌పవర్ కో.డబ్ల్యు.ఎల్.ఎల్., యునైటెడ్ టెక్నికల్ సర్వీస్ డబ్ల్యుఎల్‌ఎల్, అల్ జాబర్ మ్యాన్‌పవర్ సర్వీసెస్ కో., ఎల్లోరా మ్యాన్‌పవర్ రిక్రూట్‌మెంట్, గల్ఫ్ ఆసియా రిక్రూట్‌మెంట్, సవాహెల్ అల్-అరేబియా మ్యాన్‌పవర్, రిలయన్ట్ మ్యాన్‌పవర్ రిక్రూట్‌మెంట్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com