ఐఫోన్ 16.. ట్రేడ్-ఇన్, బైబ్యాక్ ఆఫర్‌లతో రిటైలర్లు సిద్ధం..!!

- September 12, 2024 , by Maagulf
ఐఫోన్ 16.. ట్రేడ్-ఇన్, బైబ్యాక్ ఆఫర్‌లతో రిటైలర్లు సిద్ధం..!!

యూఏఈ: అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 16.. సెప్టెంబర్ 20న మార్కెట్లోకి రానుంది. యూఏఈలోని రిటైలర్లు నివాసితుల కోసం ఆకర్షణీయమైన ట్రేడ్-ఇన్ పథకాలతో సిద్ధమవుతున్నారు. రిటైలర్‌లు తమ ఐఫోన్ విలువలో 70 శాతం వరకు కస్టమర్‌లకు పాత మోడల్ ట్రేడ్-ఇన్‌లపై Dh100 వరకు అదనపు బోనస్‌లను అందిస్తున్నారు.  ఐఫోన్ 16కి సంబంధించిన అధికారిక ప్రీ-ఆర్డర్‌లు సెప్టెంబర్ 13 నుండి ప్రారంభం కానున్నాయి. అన్ని ఉత్పత్తుల కోసం డెలివరీలు సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభమవుతాయి. జంబో ఎలక్ట్రానిక్స్, ఈరోస్  గ్రూప్ వంటి రిటైలర్‌లు అధిక డిమాండ్‌ నేపథ్యంలో అమ్మకాలకు ఆకర్షణీయమైన ఆఫర్లతో సిద్ధమవుతున్నట్లు ప్రకటించాయి. ప్రతి కొత్త ఐఫోన్ లాంచ్‌తో వచ్చే ఉత్సాహాన్ని .  జంబో ఎలక్ట్రానిక్స్ CEO వికాస్ చద్దా హైలైట్ చేశారు. నిరంతర ఆవిష్కరణలతో ఆపిల్ కొత్త ఉత్పత్తులతో నమ్మకమైన కస్టమర్ బేస్‌ను ఆకర్షించడం కొనసాగిస్తుందన్నారు. బోల్డ్ కొత్త రంగులు, AI ఫీచర్లు, స్క్రీన్ పరిమాణంలో పెరుగుదలతో ఆపిల్ ఐఫోన్ 16 నిజంగా వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరుస్తుందని తెలిపారు.  

జంబో ఎలక్ట్రానిక్స్ ఐఫోన్ 16కి సంబంధించి రెండు కీలక ఆఫర్లను ప్రకటించింది. బైబ్యాక్ ప్రోగ్రామ్, ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్. అష్యూర్డ్ బైబ్యాక్ ప్రోగ్రామ్ కస్టమర్‌లు తమ పరికరాలను మొదటి సంవత్సరంలోనే మార్పిడి చేసుకుంటే, తర్వాతి సంవత్సరాల్లో తగ్గుతున్న విలువలతో వారి ఐఫోన్ విలువలో 70 శాతం వరకు అందిస్తుంది. భవిష్యత్తులో తమ పరికరాలను అప్‌గ్రేడ్ చేసేటప్పుడు కస్టమర్‌లు సాధ్యమైనంత ఉత్తమమైన విలువను పొందేలా ఈ ప్రోగ్రామ్ దోహదం చేస్తుందని చద్దా చెప్పారు. ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్ కస్టమర్‌లు తమ పాత ఐఫోన్ మోడల్‌లు లేదా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను కొత్త ఐఫోన్ 16 కోసం మార్చుకోవడానికి అనుమతిస్తుందన్నారు. ఐఫోన్ 15, 14 మరియు 13 ట్రేడ్-ఇన్‌లపై బోనస్ Dh100 అందిస్తున్నట్లు పేర్కొన్నారు.  ఆకర్షణీయమైన ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్‌లు, సులభమైన ఫైనాన్సింగ్ స్కీమ్‌లు, Apple Care బండిల్ ప్యాకేజీలతో సహా అనేక అదనపు-విలువ సేవలను అందిస్తున్నట్లు ఎరోస్ గ్రూప్ యొక్క COO రజత్ అస్థానా తెలిపారు. ఐఫోన్ 16ప్రో ధర Dh4,299, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధర Dh5,099, ఐఫోన్ 16 Dh3,399, ఐఫోన్ 16 Plus ధర Dh3,799 నుండి ప్రారంభమవుతాయి. అలాగే ఆపిల్ వాచ్ సిరీస్ 10 ధర Dh1,599, ఆపిల్ వాచ్ అల్ట్రా 2 Dh3,199 నుంచి ప్రారంభం కానున్నాయి. AirPods 4ని Dh549కి ప్రీ-ఆర్డర్ చేయవచ్చు (యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో Dh749), AirPods Pro 2 Dh949కి, AirPods Maxతో USB-C ఛార్జింగ్ తో Dh2,099కి కోనుగోలు చేయవచ్చు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com