‘దేవర’ మౌనం దేనికి సంకేతం.!

- September 12, 2024 , by Maagulf
‘దేవర’ మౌనం దేనికి సంకేతం.!

ప్రమోషన్లు చాలా వీక్‌గా నడుస్తున్నాయ్. ఫ్యాన్స్ చాలా నిరాశపడుతున్నారు. సినిమాని తమ భుజాలపై మోసేది వాళ్లే. అలాంటిది ఫ్యాన్స్‌ని నిరాశ పరిచడం భావ్యమేనా.?

ఎందుకని ‘దేవర’ టీమ్ సైలె్ంట్‌గా వుంది. ఒకవేళ ‘ఆచార్య’ సినిమా రిజల్ట్ నేపథ్యంలోనే ‘దేవర’ టీమ్ ఈ విధంగా వ్యవహరిస్తోందా.? అనేక రకాల అనుమానాలు ‘దేవర’ చుట్టూ అల్లుకుంటున్నాయ్.

ఇంతవరకూ వచ్చిన మూడు సాంగ్స్, ట్రైలర్ కూడా సో సోగానే వున్నాయ్. సినిమా రిలీజ్‌కి ఇంకెంతో టైమ్ లేదు. కానీ, ప్రమోషన్ల హంగామా ఎక్కడా కనిపించడం లేదు.
ఎన్టీయార్‌కి విషయం ముందే అర్ధమైపోయిందా.? లేక ఎన్టీయార్ మనసులో ఏముంది.? ఈ మౌనం మాత్రం చాలా తేడా కొడుతోంది. సెప్టెంబర్ 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అయితే, బాలీవుడ్ మీడియాతో మాత్రం ఎన్టీయార్ బాగానే ఇంటరాక్ట్ అవుతున్నాడు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో కరణ్ జోహార్ ‘దేవర’ను బాలీవుడ్‌లో రిలీజ్ చేస్తున్నాడు.

ఈ నేపథ్యంలో కరణ్ జోహార్‌తో కలిసి ఎన్టీయార్ బాగానే ఇంటర్య్యూల్లో పాల్గొంటున్నాడు. కానీ, తెలుగులో మాత్రం ఆ సందడి కనిపించడం లేదెందుకో.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com