దుబాయ్ లో యూనిఫైడ్ పాపులేషన్ రిజిస్ట్రీ.. ప్రకటించిన షేక్ హమ్దాన్
- September 12, 2024
యూఏఈ: దుబాయ్ త్వరలో యూనిఫైడ్ జనాభా రిజిస్ట్రీని రూపొందిచనుంది. ఇది ఎమిరేట్ నివాసితుల సమగ్ర, రియల్ టైమ్ డేటాబేస్‌ను కలిగి ఉంటుంది. ఈ మేరకు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ ప్రధాని, రక్షణ మంత్రి, దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఒక తీర్మానాన్ని విడుదల చేశారు.
దుబాయ్ డేటా అండ్ స్టాటిస్టిక్స్ కార్పొరేషన్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో "యూనిఫైడ్ రిజిస్ట్రీ ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ ది ఎమిరేట్ ఆఫ్ దుబాయ్" అని పిలిచే రిజిస్ట్రీని ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ ప్రణాళికలు, వ్యూహాలు, విధానాల తయారీలో డేటాబేస్ ఉపయోగించబడుతుంది. దుబాయ్ డేటా, స్టాటిస్టిక్స్ ఎస్టాబ్లిష్‌మెంట్ జనాభా రిజిస్ట్రీని నిర్వహిస్తుంది. అవసరమైన డేటాను సేకరించడం కోసం ప్రభుత్వ సంస్థలతో సమన్వయంగా ముందుకు వెళుతుందని ప్రకటించారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







