యూకేలో ఆరోపణలు.. యూఏఈలో పిల్లల డాక్టర్ పై సస్పెండ్ వేటు..!
- September 13, 2024
దుబాయ్: దుబాయ్ లో పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ యాసర్ జబ్బార్ ను సర్వీసు నుంచి తొలగించారు. అతను పనిచేస్తున్న క్లెమెన్సీ మెడికల్ సెంటర్ నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. CMC హాస్పిటల్ దుబాయ్ లో పనిచేసే వైద్యునికి సంబంధించిన దుష్ప్రవర్తన ఆరోపణలకు సంబంధించిన ఇటీవలి నివేదికల నేపథ్యంలో డాక్టర్ యాసర్ పై సస్పెండ్ వేటు వేసినట్టు CMC హాస్పిటల్ సీఈఓ డాక్టర్ అలియా అల్ మజ్రోయి తెలిపారు. తదుపరి చర్యల కోసం సంబంధిత అధికారుల నిర్ణయాల కోసం ఎదురుచూస్తున్నామని అన్నారు.
బ్రిటన్ అల్ సఫాలోని ఆర్థోక్యూర్, మెడ్కేర్ ఆర్థోపెడిక్స్ మరియు స్పైన్ హాస్పిటల్ లో డాక్టర్ యాసర్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు, అందులో అనధికారికంగా అనేకమందికి ఆపరేషన్లు చేసాడని, అందులో చాలామంది పిల్లలు వివిధ సమస్యలతో బాధపడుతున్నట్లు బ్రిటిష్ మీడియా వెల్లడించడంతో డాక్టర్ యాసర్ కార్యాకలాపాలు వెలుగులోకి వచ్చాయి. కాగా, “డాక్టర్ యాసర్ జబ్బార్ ఇప్పటి వరకు మెడ్కేర్లో ఏ రోగిని సంప్రదించలేదు లేదా శస్త్రచికిత్స చేయలేదు. అతను ఆర్థోక్యూర్లో ఎక్స్టర్నల్ కన్సల్టెంట్, ఆర్థోక్యూర్ సర్జికల్ విభాగంలో తమతో భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నారు. ”అని సదరు హాస్పిటల్ స్పష్టం చేసింది.
అయితే, డాక్టర్ యాసెర్ కేవలం ఏడు నెలల క్రితం ఆర్థోక్యూర్లో చేరారు. ఇప్పుడు తొలగించబడిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో మాత్రం "20 సంవత్సరాలకు పైగా విస్తృతమైన క్లినికల్ అనుభవం" ఉన్నట్టుగా పేర్కొన్నారు. దుబాయ్‌లో జరిగిన 10వ వార్షిక మెనా ఇంటర్నేషనల్ ఆర్థోపెడిక్ కాంగ్రెస్‌లో అతను మాట్లాడాల్సి ఉండగా.. తాజా చర్యలతో స్పీకర్ల జాబితా నుండి అతని పేరును తొలగించారు.
ఆరోపణలు ఇవే
డాక్టర్ యాసెర్ 2017 నుండి 2023 చివరి వరకు బ్రిటన్ లోని గ్రేట్ ఒర్మాండ్ స్ట్రీట్ హాస్పిటల్ లో ప్రాక్టీస్ చేసారు. అతను 700 కంటే ఎక్కువ కేసుల అత్యవసర ఆపరేషన్లను నిర్వహించారు. కాగా, ఇప్పటివరకు పరిశీలించిన 39 కేసుల్లో 22 మంది చిన్నారులు వివిధ సమస్యలతో బాధపడుతున్నట్లు ఆసుపత్రి తెలిపింది. జూన్ 2022లో డాక్టర్‌పై మొదట ఆరోపణలు వచ్చాయి. దీంతో అతడిపై 11 నెలల పాటు వేతనంతో సెలవు ప్రకటించారు. ఈ క్రమంలో అతను సెప్టెంబర్ 2023లో రాజీనామా చేశాడు. అయితే, అతను యూఏఈకి ఎప్పుడు వచ్చాడు.. హాస్పిటల్ లో చేరి ఇక్కడ ఏవైనా శస్త్రచికిత్సలు చేసాడా అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.
తాజా వార్తలు
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్‌పోస్ట్‌పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్‌లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!
- విదేశాలకు వెళ్లే గోల్డెన్ వీసా హోల్డర్లకు యూఏఈ కీలక సూచనలు..
- ఏపీ అస్త్రం యాప్‌ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
- 26 రోజుల పోరాటానికి తెర.. సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమణ
- ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, ఏడాది చిన్నారి మృతి..!!
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం







