కువైట్ లో మహిళకు వేధింపులు..రంగంలోకి ఏపీ మంత్రి!
- September 13, 2024
కువైట్ సిటీ: అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం నారాయణరెడ్డి పల్లి గ్రామానికి చెందిన కవితా అనే మహిళ బ్రతుకుతెరువు కోసం కువైట్ వెళ్లానని ఇక్కడ కువైట్ వాళ్ళు నన్ను కొట్టి చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక్కడ బయట ఒక రూములో బందించి తినడానికి తిండి కూడా ఇవ్వకుండా నాకు నరకం చూపిస్తున్నారని ఇక్కడ ఏజెంట్ ను అడగగా అతను నన్ను బెదిరిస్తూ నువ్వు ఇక్కడ డబ్బులు కట్టాలి లేదంటే నిన్ను ఇక్కడ అమ్మేస్తామని నన్ను భయపెడుతున్నాడని, నాకు వీసా తీసిన అతనిని అన్నా నేను ఇక్కడ పని చేయలేను వీళ్ళు నన్ను కొడుతున్నారు అని అడగగా నువ్వు ఇక్కడ నుంచి పారిపో నాకు సంబంధం లేదు అని చెప్పి నేను ఫోన్ చేస్తే నా ఫోన్ బ్లాక్ లిస్టులో పెట్టాడని, అన్నా నాకు ఇద్దరు పిల్లలు భర్త ఉన్నాడని నా భర్త వికలాంగుడు ఏ పని చేయలేడని నేను నా బిడ్డల కోసం బ్రతుకు తెరువు కోసం కువైట్ వస్తే ఇలా నాకు అన్యాయం జరిగింది. నాకు ఇక్కడ ఎవరు సహాయం చేయడం లేదు అన్నా మీరే నన్ను ఎలాగైనా కాపాడి ఇండియాకు వచ్చేలా సహాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని వేడుకుంది.
--సాయికిరణ్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్‌పోస్ట్‌పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్‌లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!
- విదేశాలకు వెళ్లే గోల్డెన్ వీసా హోల్డర్లకు యూఏఈ కీలక సూచనలు..
- ఏపీ అస్త్రం యాప్‌ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
- 26 రోజుల పోరాటానికి తెర.. సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమణ
- ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, ఏడాది చిన్నారి మృతి..!!
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం







