హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు క్లోజ్
- September 13, 2024
హైదరాబాద్: ప్రస్తుతం దేశ ప్రజలంతా వినాయక చవితి పండుగ మూడ్ లో ఉన్నారు. చిన్న, పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో భక్తిశ్రద్ధలతో వినాయకుడిని పూజిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కడ చూసిన వినాయక చవితి పండుగ వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో జరిగే వినాయక చవితి సెలబ్రేషన్స్‌కు ప్రత్యేకత ఉంది. చివరి రోజు అన్ని విగ్రహాలు నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్ వైపు కదులుతాయి. ఆ శోభాయాత్రలు అద్భుతంగా కనివిందు చేస్తుంటాయి. ఈ శోభాయాత్రలను చూసేందుకు లక్షల మంది ట్యాంక్ బండ్ వద్దకు వస్తారు. ఈ క్రమొంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గణపతి నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఈ నెల 17 ఉదయం 6 గంటల నుంచి 18 సాయంత్రం 6 గంటల వరకు రెండు రోజుల పాటు మద్యం షాపులు బందు చేయనున్నట్లు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండటానికి.. ఈ నెల 17, 18 తేదీల్లో హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న వైన్స్‌లు, కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు బంద్ చేయాలని సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.అయితే, నగరంలోని స్టార్ హోటల్ బార్‌లు, రిజిస్టర్ క్లబ్‌లకు ఈ రూల్ వర్తించదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..