'దళపతి 69' అఫీషియల్ అనౌన్స్మెంట్
- September 15, 2024
హైదరాబాద్: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో కె.వి.ఎన్.ప్రొడక్షన్స్ సంస్థ నుంచి అలజడిని సృష్టించే ప్రకటన వెలువడింది. అదే దళపతి 69. విజయ్ హీరోగా రూపొందుతోన్న చివరి చిత్రం. మూడు దశాబ్దాల ప్రయాణంలో దళపతి విజయ్ సినీ రంగంలో తిరుగులేని స్టార్‌డమ్‌తో కథానాయకుడిగా రాణించారు. ఈయన కథానాయకుడిగా రానున్న దళపతి 69 చిత్రం.. 2025 అక్టోబర్ నెలలో థియేటర్స్లో తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో సంచలనం సృష్టించనుంది.
హెచ్ వినోద్ మరో అద్భుతమైన కథతో సిద్దంగా ఉన్నారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచంద్రన్ గుర్తుండిపోయే సంగీతాన్ని అందివ్వనున్నారు. ఈ సినిమాకు జగదీష్ పళనిస్వామి, లోహిత్ సహ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఎన్. కే., వెకంట్ కే నారాయణ ఆధ్వర్యంలో ఈ మూవీ నిర్మితం కానుంది.
ఈ చిత్రం దళపతి అభిమానులకు ఎంతో ప్రత్యేకం కానుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దళపతి విధేయులైన అభిమానులకు ఈ మూవీ గుర్తుండిపోయేలా ఉంటుంది. కొంగొత్త రికార్డులను క్రియేట్ చేసేలా ఈ మూవీని రూపొందించబోతోన్నారు. కేవీఎన్ ప్రొడక్షన్ సంస్థ వదిలిన వీడియోలో దళపతి అభిమానులు ఎంతగా ఎమోషనల్ అయ్యారో అందరికీ తెలిసిందే. దళపతి పట్ల అభిమానుల ప్రేమను ఆ వీడియోలో చూడొచ్చు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
‘దళపతి విజయ్‌తో మా మొదటి చిత్రం.. దళపతి 69వ సినిమాను హెచ్ వినోద్‌తో కలిసి చేస్తుండటం ఆనందంగా ఉంది.టార్చ్ బేరర్ అయిన విజయ్‌తో తీస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందివ్వనున్నారు.ఈ మూవీ వచ్చే ఏడాది అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దళపతి విజయ్‌కి ఇది చివరి సినిమా కానుండటంతో..ఇండియన్ సినిమా హిస్టరీలో నిలిచేపోయేలా, అభిమానులంతా కలిసి సెలెబ్రేట్ చేసుకునేలా తెరకెక్కిస్తామ’ని మేకర్లు అన్నారు.
తాజా వార్తలు
- ఆఫ్‌లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!







