ఆరు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- September 15, 2024
న్యూ ఢిల్లీ: వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు.ఈ రైళ్లు టాటానగర్-పాట్నా, బ్రహ్మపూర్-టాటానగర్, రూర్కెలా-హౌరా, డియోఘర్-వారణాసి, భాగల్పూర్-హౌరా, గయా-హౌరా వంటి ఆరు కొత్త మార్గాలలో ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి.ఈ వందే భారత్ రైళ్లు గంటకు 160 కి.మీల వేగంతో ప్రయాణిస్తాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిత్యం 120 ట్రిప్పులతో ఇవి ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో వివిధ రైల్వే ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేసి, జాతికి అంకితం చేశారు. ఝార్ఖండ్‌లోని టాటానగర్‌లో 20,000 మంది ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన- గ్రామీణ (PMAY-G) లబ్ధిదారులకు రూ.660 కోట్లను మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించారు. తాజాగా కొత్త రైళ్లు అందుబాటులోకి రావడంతో ప్రయాణికులు డియోఘర్ (ఝార్ఖండ్)లోని బైద్యనాథ్ ధామ్, వారణాసి(ఉత్తరప్రదేశ్)లోని కాశీ విశ్వనాథ ఆలయం, కాళీఘాట్, కోల్‌కతా(పశ్చిమ బెంగాల్)లోని బేలూర్ మఠం పుణ్యక్షేత్రాలకు సులువుగా ప్రయాణించవచ్చని రైల్వేశాఖ మంత్రి తెలిపారు. అంతేకాకుండా ధన్‌బాద్‌లోని బొగ్గు, గనుల పరిశ్రమలు, కోల్‌కతాలోని జూట్ పరిశ్రమలు, దుర్గాపూర్‌లో ఇనుము, ఉక్కు అనుబంధ రంగాలకు ఇవి ప్రోత్సాహకరంగా ఉంటాయన్నారు.ఈ రైళ్లను ప్రారంభించడానికి మోదీ ఝార్ఖండ్‌కు వెళ్లాల్సి ఉంది. కానీ, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రయాణాన్ని రద్దు చేసుకోవడంతో.. ఈ కార్యక్రమాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు కొత్తగా రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.వీటిని ఈనెల 16న అహ్మదాబాద్ నుంచి ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. రెండు రైళ్లలో ఒకటి తెలంగాణలోని హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు, మరొకటి ఏపీలోని విశాఖపట్నం నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ మధ్య రాకపోకలు సాగించనున్నాయి.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్‌లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







