మార్చి 2025 నాటికి గల్ఫ్ కు ఎయిర్ కేరళ సర్వీసులు

- September 16, 2024 , by Maagulf
మార్చి 2025 నాటికి గల్ఫ్ కు ఎయిర్ కేరళ సర్వీసులు

న్యూఢిల్లీ: దక్షిణ భారత రాష్ట్రమైన కేరళలో కొత్తగా ప్రకటించిన ఎయిర్‌లైన్ ఎయిర్ కేరళ, మార్చి 2025 నాటికి కార్యకలాపాలు ప్రారంభించాలని భావిస్తోంది. ఈ విషయం ఎయిర్‌లైన్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు భారత పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ను కలిసిన తర్వాత వెల్లడించారు. 

ఎయిర్ కేరళ.కామ్ చైర్మన్ అఫీ అహ్మద్ మాట్లాడుతూ గల్ఫ్ సహా అంతర్జాతీయ కార్యకలాపాలు వచ్చే రెండేళ్లలో ప్రారంభమవుతాయని తెలిపారు. ఎయిర్‌లైన్‌ను అల్ట్రా-లో-కాస్ట్ క్యారియర్ (ULCC) గా మోడల్ చేస్తామని అహ్మద్ చెప్పారు. ఎయిర్‌లైన్‌కు కావలసిన అవసరమైన సహాయాన్ని అందిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారనీ, తద్వారా ఎయిర్‌లైన్ తన అనుమతులను పొందడం మరియు విజయవంతంగా ప్రారంభించడం సులభం అవుతుందని, ఇది భారతదేశ విమానయాన పరిశ్రమకు ఒక ముఖ్యమైన మైలురాయి అని ఎయిర్ కేరళ.కామ్ చైర్మన్ అఫీ అహ్మద్ తెలిపారు.

ఎయిర్ కేరళ సీఈఓ హరీష్ కుట్టి మాట్లాడుతూ, ఒమన్ బడ్జెట్ ఎయిర్‌లైన్ సలామ్ ఎయిర్‌తో మంచి సంబంధాలు కలిగి ఉన్నామని, మార్చి 2025 నాటికి మా విమానాలు గల్ఫ్ గగనతలంలో ఎగరడం ప్రారంభిస్తాయని, కేరళలో ప్రాంతీయ పర్యాటకాన్ని పెంచడానికి సీప్లేన్ సేవలను ప్రవేశపెట్టడానికి ప్రణాళికలను కూడా చర్చించామని ఆయన తెలిపారు. 

ఎయిర్ కేరళ.కామ్ వైస్ చైర్మన్ అయూబ్ కల్లాడా మాట్లాడుతూ ఎయిర్ కేరళ, కేరళ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మెరుగుపరచడానికి మరియు విమానయాన రంగంలో కొత్త ఒరవడిని సృష్టించడానికి కృషి చేస్తోందని తెలిపారు. ఈ కొత్త ఎయిర్‌లైన్ ప్రారంభం కేరళ రాష్ట్రంలో విమానయాన రంగానికి కొత్త ఊపును తీసుకురావడమే కాకుండా, ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించడానికి కూడా సహాయపడుతుందని తెలిపారు.

ఎయిర్ కేరళ ప్రారంభంలో టైర్ 2, టైర్ 3 నగరాల్లో సేవలు అందించనుంది. రెండేళ్లలో గల్ఫ్ దేశాలకు కూడా సేవలు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎయిర్‌లైన్ ప్రారంభంలో మూడు ATR 72-600 టర్బోప్రాప్ విమానాలను కలిగి ఉంటుంది, వీటిని అంతర్జాతీయ కార్యకలాపాల అవసరాలను తీర్చడానికి కూడా విమానాలుగా విస్తరించనుంది.

 --వేణు పెరుమాళ్ల✍🏼(మాగల్ఫ్ ప్రతినిధి)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com