ఒమన్-యూఏఈ రైల్వే ప్రాజెక్ట్ పై మరోసారి సమీక్ష
- September 17, 2024
ఒమన్ మరియు ఎతిహాద్ రైల్ కంపెనీ (OERC) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) రాజధాని అబుదాబితో సుహార్ నగరాన్ని కలిపే రైల్వే ప్రాజెక్ట్ అమలు గురించి అల్ బురైమి మునిసిపల్ కౌన్సిల్ సోమవారం ఈ సంవత్సరానికి ఏడవ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో అల్ బురైమి గవర్నర్ మరియు అల్ బురైమి మునిసిపల్ కౌన్సిల్ చైర్మన్ సయ్యద్ డాక్టర్ హమద్ బిన్ అహ్మద్ అల్ బుసైడీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇంజనీర్ అహ్మద్ అల్ ముసావా అల్ హషేమీ, హఫీత్ రైల్ CEO, మరియు Asyad గ్రూప్ నుండి నిపుణులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
అల్ హషేమీ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ రెండు దేశాల మధ్య రవాణా మరియు వాణిజ్య సంబంధాలను మెరుగుపరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకా స్థానికంగా రవాణా ఇతర సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారా స్థానిక కమ్యూనిటీలకు ప్రయోజనం చేకూర్చేలా ప్రాజెక్ట్‌కు సంబంధించిన అన్ని పనులలో ప్రాముఖ్యతను చర్చించారు. ఈ సమావేశంలో అల్ బురైమి మునిసిపాలిటీ ప్రాజెక్ట్స్ డిపార్ట్‌మెంట్ సైకిల్ ట్రాక్ నిర్మాణం, అది ఎదుర్కొనే సవాళ్లను సమీక్షించింది. వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి ప్రతిపాదిత ప్రణాళికలను కూడా చర్చించారు. అదనంగా, దెబ్బతిన్న రోడ్లను మరమ్మత్తు చేయాలనే సంఘం డిమాండ్లను కూడా చర్చించారు. ఈ సమావేశంలో ఇతర ప్రాజెక్టులు మరియు సేవలకు సంబంధించిన అనేక అంశాలపై కూడా చర్చ జరిగింది.
303 కిలోమీటర్ల పొడవు కలిగి ఉన్న ఈ రైల్వే నెట్‌వర్క్ ఒమాన్ లోని సుహార్ నుండి అబుదాబికి ప్రయాణ సమయాన్ని 1 గంట 40 నిమిషాలకు తగ్గిస్తుంది. ఈ ప్రాజెక్ట్ రెండు దేశాల జాతీయ ఆర్థిక వ్యవస్థల వృద్ధికి తోడ్పడుతుంది. ఈ రైల్వే ప్రాజెక్ట్ ద్వారా ప్రైవేట్ రంగానికి పెట్టుబడి అవకాశాలు మరియు మద్దతు ఒప్పందాలు లభిస్తాయి. ఈ ప్రాజెక్ట్ పర్యాటక కార్యకలాపాలను ప్రోత్సహిస్తుంది మరియు రెండు దేశాల గ్లోబల్ ట్రేడ్‌లో పోటీ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఒమన్ మరియు UAE మధ్య వ్యూహాత్మక మరియు చారిత్రాత్మక సంబంధాలను బలోపేతం చేస్తుంది.
వేణు పెరుమాళ్ళ, మాగల్ఫ్ ప్రతినిధి
తాజా వార్తలు
- అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే
- తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం
- టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది
- టీ20 సిరీస్ టీమిండియాదే
- మేరీల్యాండ్‌లో మెరిసిన తెలుగు ఆణిముత్యాలు
- ముసాందంలో వరదల్లో డ్రైవింగ్.. డ్రైవర్ అరెస్ట్..!!
- అత్యున్నత పురస్కారాల్లో ప్రధాని మోదీ రికార్డు..!!
- ఏనుగు సజీవ దహనం..ముగ్గురు అరెస్ట్..!!
- 72 మిలియన్ గ్యాలన్ల రెయిన్ వాటర్ తొలగింపు..!!
- మెచ్యూరిటీ ఇండెక్స్ 2025లో సౌదీకి రెండో స్థానం..!!







