ఖతార్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ 2024-2030 ప్రారంభం..!

- September 18, 2024 , by Maagulf
ఖతార్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ 2024-2030 ప్రారంభం..!

దోహా: ప్రధాన మంత్రి,  విదేశాంగ మంత్రి HE షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ ఆధ్వర్యంలో నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ 2024-2030 నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను సురక్షితంగా స్వీకరించడంలో ఖతార్‌ను గ్లోబల్ లీడర్‌గా ఉంచడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. సైబర్‌స్పేస్‌పై నమ్మకాన్ని పెంపొందించడానికి అనేక ప్రచార కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.  రిస్క్ బేస్డ్ అప్రోచ్, రిజల్ట్స్ ఓరియెంటెడ్, వ్యక్తిగత మానవ హక్కులు, ఆర్థిక శ్రేయస్సు, సమన్వయం, విలువలపై జాతీయ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ మార్గదర్శక సూత్రాలు ఆధారపడి ఉన్నాయని ఆయన హైలైట్ చేశారు. అభివృద్ధి చెందుతున్న సైబర్ సవాళ్లను పరిష్కరించడానికి రెండవ జాతీయ సైబర్ భద్రతా వ్యూహం రోడ్‌మ్యాప్‌గా పనిచేస్తుందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com