జ్ఞాపక శక్తి పెరగాలంటే ఈ ఆహార పదార్ధాలు తినాల్సిందే.!
- September 18, 2024
మానవ శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో ఒకటి మెదడు. ఇది శరీరంలోని మిగిలిన అవయవాలన్నింటితోనూ కనెక్ట్ అయ్యి శరీరం పని చేయడానికి అవసరమైన శక్తిని ఇండికేషన్స్‌నీ అందిస్తుంది. అందుకే మెదడు చురుగ్గా పని చేస్తేనే శరీరం సరిగ్గా పని చేస్తున్నట్లు.
అయితే, మెదడు చురుగ్గా పని చేసేందుకు ఏం చేయాలి.? ముఖ్యంగా మంచి పోషకాలున్న ఆహారం తినాలి. అయితే, మెదడును శక్తివంతంగా పని చేసేందుకు కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్ధాలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం.
వాల్ నట్స్, వేరుశనగలో ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలుంటాయ్. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా పని చేస్తుంది.
కాలీ ఫ్లవర్, బ్రోకోలీ వంటి కూరగాయల్లో అధిక మొత్తం కోలీన్ వుంటుంది. ఇది మెదడు ఆరోగ్యంగా, చురుగ్గా పని చేసేందుకు తోడ్పడుతుంది. అందుకే వీటిని కూడా డైట్‌లో తప్పని సరిగా చేర్చుకోవాలి.
బీన్స్‌లోనూ విటమిన్ బి మరియు ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయ్. ఇవి జ్ఞాపక శక్తిని మెరుగు పరిచేందుకు తోడ్పడతాయ్. ఆకుకూరల్లో వుండే విటమిన్ ఇ, ఫోలేట్ మెదడు ఆరోగ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర వహిస్తాయ్.
బ్లూ బెర్రీస్ ఇతరత్రా బెర్రీస్ ఏవైనా మెదడు ఆరోగ్యాన్ని అభివృద్ధి చేయడంలో తోడ్పడతాయ్. అంతేకాదు, క్షీణించిన మెదడు నరాల్ని ఉత్తేజపరచడంలోనూ బెర్రీస్ పాత్ర కీలకం.
నాన్ వెజ్‌లో సాల్మన్ ఫిష్‌కి జ్ఞాపక శక్తిని మెరుగు పరిచే సామర్ధ్యం ఎక్కువ. చచ్చుబడిపోయిన నరాల పనితీరును మెరుగు పరిచి కమ్యూనికేషన్ నైపుణ్యాన్ని పెంచడంలో సాల్మన్ ఫిష్ బాగా యూజ్ అవుతుంది.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!