జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు.! కర్త కర్మ క్రియ అతడేనా.?
- September 18, 2024
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై అసిస్టెంట్ లైంగిక వేధిపుల కేసు టాలీవుడ్‌లో దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసు వెనక ఓ పెద్ద హీరో వున్నట్లు తాజాగా ఇండస్ట్రీలో టాక్ బయటికి వచ్చింది.
ఆయన మరెవరో కాదు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అల్లు అర్జున్‌కీ, జానీ మాస్టర్‌కీ గతంలో విబేధాలున్న సంగతి చూచాయగా తెలిసిందే. టైమ్ చూసి జానీ మాస్టర్‌ని బన్నీ బుక్ చేసేశాడనీ మాట్లాడుకుంటున్నారు.
ప్రస్తుతం జనసేన పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న జానీమాస్టర్‌పై ఎలాగైనా బురద చల్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అదే అదనుగా అప్పుడెప్పుడో ఆరేళ్ల క్రితం జరిగిన అసిస్టెంట్ కొరియోగ్రఫర్ ఇష్యూని వెలికి తీసి, ఆమెకి అండగా నిలుస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చి, జానీ మాస్టర్‌ని అడ్డంగా బుక్ చేసేశాడట బన్నీ.
డైరెక్ట్‌గానే ఈ విషయాన్ని ఫిలిం సర్కిల్స్‌లో చర్చించుకుంటున్నారు. ఈ ఎపిసోడ్ అంతటినీ వెనకుండి నడిపించింది బన్నీనే అంటున్నారు. అయితే, ఆపదలో వున్న ఓ ఆడపిల్లకి అండగా నిలచాడంతే బన్నీ.. అంతకు మించి మరేం లేదంటూ ఆయన టీమ్ కవరింగ్ వేసుకుంటున్నారు.
అంతగా ఆడపిల్లలకు సపోర్ట్ చేసేవాడే అయితే, తన తోటి నటుడు ‘పుప్ప’ ఫేమ్ జగదీష్ కారణంగా అన్యాయం అయిపోయిన ఆ అమ్మాయి, ఆమె కుటుంబం బన్నీకి గుర్తుకు రాలేదా.? అంటూ మెగా అభిమానులు మరో విషయాన్ని పైకి తీసుకొచ్చారు. చూస్తుంటే, ఈ రచ్చ ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!