ఏపీ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే..

- September 18, 2024 , by Maagulf
ఏపీ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే..

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు(బుధవారం) ఏపీ క్యాబినెట్ సమావేశం జరిగింది. ఉదయం 11గంటలకు ఈ సమావేశం మొదలుకాగా.. పలు నిర్ణయాలు తీసుకున్నారు. నూతన మద్యం పాలసీపై సుదీర్ఘంగా చర్చించింది. వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి తీసుకొచ్చిన మద్యం పాలసీకి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఆపరేషన్ బుడమేరు అంశం పై కూడా కేబినెట్ చర్చించింది.

ఇలాంటి విపత్తులు మరోసారి ఎదురుకాకుండా చేపట్టాల్సిన చర్యలపై మంత్రులు చర్చించారు. దీని కోసం కార్యచరణ సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఇవి కాకుండా పారిశ్రామిక అభివృద్ధి, విద్యుత్ సంస్కరణలపై కూడా మంత్రిమండలి సమాలోచనలు జరుపుతోంది. వంద రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో తీసుకున్న నిర్ణయాలు, మంత్రుల గ్రాఫ్, ఎమ్మెల్యేల పని తీరు ఇలా అన్నింటిపై కూలంకుశంగా మాట్లాడుకున్నారు. జనసేన మంత్రుల గ్రాఫ్‌ను చంద్రబాబుకు పవన్ కల్యాణ్ అందజేశారు. ఈనెల 20వ తారీకుతో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100రోజులు కానుండడంతో ఇప్పటివరకూ చేసిన పనులపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com