కువైట్ లో గుండె పోటుతో జగిత్యాల వాసి మృతి...!
- September 19, 2024
కువైట్ సిటీ: కువైట్ లో మరో తెలంగాణ వ్యక్తి మరణించారు. కువైట్ లో అకస్మాత్తుగా గుండె పోటుతో జగిత్యాల వాసి మృతి చెందారు. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన సాయి కృష్ణ (37) అకస్మాత్తుగా గుండె పోటు తో మృతి చెందడం జరిగింది. సాయి కృష్ణ... కువైట్ లో పది సంవత్సరాల నుండి ఉపాధి పొందుతూ తన కుటుంబాన్ని పోషించూకుంటున్నాడు. అయితే.. రెండు సంవత్సరాలకు ఒకసారి ఇంటికి వస్తున్నారు సాయి కృష్ణ. ఇటీవలే నెల క్రితం ఇంటికి వచ్చి తన కుటుంబ సభ్యులతో కలసి తీర్థ యాత్రలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు సాయి కృష్ణ. తిరిగి మళ్ళీ బ్రతుకు తెరువు కోసం 5 రోజుల క్రితం కువెట్ వెళ్ళాడం జరిగింది. అయితే...ఈ తరుణంలోనే... ఆదివారం సాయంత్రం అకస్మాత్తుగా గుండె పోటుతో మృతి చెందారు. ఈ విషయాన్ని తన సహచర స్నేహితులు ఫోన్ ద్వారా తన కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడి పిల్లలు రోధించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఇక మృతిడికి భార్య ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
--సాయి కిరణ్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- కామారెడ్డి బాలల సంబరాల్లో పాల్గొన్న NATS
- నిరుద్యోగులకు సీఎం రేవంత్ శుభవార్త
- టీ20 ప్రపంచకప్‌కి టీమిండియా జెర్సీ విడుదల
- హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ఎక్స్‌ప్రెస్ వే..
- WTITC: గ్లోబల్ స్టూడెంట్ ఇన్నోవేషన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్
- యూఏఈలో ఫేక్ ఇన్వెస్టర్లు..ఇన్వెస్టర్లకు హెచ్చరిక..!!
- గాయపడ్డ ఆసియా ప్రవాసి ఎయిర్ లిఫ్ట్..!!
- పౌరుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధానం: క్రౌన్ ప్రిన్స్
- ఖతార్ మ్యూజిమ్స్ లో సాంస్కృతిక, క్రియేటివిటీ ఈవెంట్లు..!!
- బహ్రెయిన్-ఇటలీ సంబంధాలు బలోపేతం..!!







