డ్రోన్ యూనిట్లను పెంచనున్న దుబాయ్ పోలీసులు.. గోప్యతపై క్లారిటీ..!!
- September 19, 2024
యూఏఈ: దుబాయ్ పోలీసులు తమ ఫ్లాగ్షిప్ డ్రోన్ వినియోగాన్ని ఈ ఏడాది చివరి నాటికి ఆరు నుండి ఎనిమిది యూనిట్లకు పెంచాలని యోచిస్తున్నారు. ఈ అధునాతన వ్యవస్థ, పోలీసింగ్ భవిష్యత్తుకు కీలకంగా భావిస్తున్నారు. అత్యవసర ప్రతిస్పందన సమయాలను మెరుగుపరచడం, ఎమిరేట్ అంతటా ప్రజల భద్రతను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. 2021లో యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధానమంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ తొలిసారిగా డ్రోన్ బాక్స్ సిస్టమ్‌ను పరిచయం చేశారు. జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆపరేషన్స్‌లోని మానవరహిత ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్ సెంటర్ హెడ్ కెప్టెన్ మొహమ్మద్ ఒమర్ అల్ముహైరి ఈ ప్రాజెక్ట్ గురించి వివరిస్తూ.. “డ్రోన్ బాక్స్ సిస్టమ్ అత్యవసర పరిస్థితులకు ప్రతిస్పందన సమయాన్ని తగ్గించడంలో నిర్ణయాత్మక ప్రక్రియలకు అవసరమైన డేటా మద్దతును అందించడంలో కీలకమైనది. కనీస మానవ జోక్యంతో దుబాయ్ అంతటా సమగ్ర కవరేజీని కలిగి ఉండటమే మా లక్ష్యం. ’’ అని పేర్కొన్నారు.
మెరుగైన పోలీసింగ్ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలనే వ్యూహాంలో భాగంగా అధునాతన డ్రోన్ వ్యవస్థను మోహరించిన మొదటి గ్లోబల్ ఏజెన్సీలలో దుబాయ్ పోలీస్ కూడా ఒకటి. డ్రోన్లు ట్రాఫిక్ పర్యవేక్షణ, అత్యవసర ప్రతిస్పందన, సంక్షోభ నిర్వహణతో సహా అనేక రకాల కార్యకలాపాలకు ఉపయోగపడతాయి. అదే సమయంలో డ్రోన్ బాక్స్ వ్యవస్థ గురించి ప్రజలలో ఉన్న అపోహలను కెప్టెన్ మహ్మద్ ఒమర్ అల్ముహైరి కొట్టిపారేశారు. ప్రజల గోప్యతకు సంబంధించిన ఆందోళనలు అనవసరమని తెలిపారు. ముఖ్యంగా నివాస ప్రాంతాలలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







