కువైట్‌లో 32 ఏళ్లపాటు సేవలు.. డాక్టర్ రమేష్ పండితకు ఘన సత్కారం..!!

- September 19, 2024 , by Maagulf
కువైట్‌లో 32 ఏళ్లపాటు సేవలు.. డాక్టర్ రమేష్ పండితకు ఘన సత్కారం..!!

కువైట్: ఇటీవలే కువైట్ ఆరోగ్య సంరక్షణ రంగానికి విశేషమైన సేవలందించినందుకు ప్రఖ్యాత భారతీయ వైద్యుడు, డాక్టర్ రెమేష్ పండితను కువైట్ ఆరోగ్య మంత్రి, డాక్టర్ అహ్మద్ అల్-అవధి ఘనంగా సత్కరించారు. మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ డాక్టర్ అబ్దుల్‌రహ్మాన్ అల్-ముతైరీ హాజరయ్యారు.  డాక్టర్ పండిత పదవీ విరమణ సందర్భంగా మూడు దశాబ్దాల సేవలకు గుర్తుగా జ్ఞాపికను అందజేశారు.

డాక్టర్ పండిత, 1977లో భారతదేశంలోని కాశ్మీర్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యారు. 1982లో చండీగఢ్‌లోని PGIMER నుండి MD పట్టా పొందారు. కువైట్ క్యాన్సర్ నియంత్రణ కేంద్రంలో హేమటాలజీ విభాగంలో చేరారు. అక్కడ అతను 32 సంవత్సరాలు పనిచేశారు. తన కెరీర్ లో లుకేమియా, మైలోమాపై ప్రత్యేక దృష్టి సారించి, బ్లడ్ క్యాన్సర్ రోగుల చికిత్సలో నైపుణ్యాన్ని  సాధించారు. కువైట్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెడికల్ స్పెషలైజేషన్ సహకారంతో కువైట్‌లోని చాలా మంది వైద్యులు, నిపుణులకు శిక్షణ ఇచ్చారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. డాక్టర్ పండిత కువైట్‌లో ప్రాక్టీస్ చేస్తున్న భారతీయ వైద్యులకు ప్రాతినిధ్యం వహించే ఇండియన్ డాక్టర్స్ ఫోరమ్ కువైట్ మాజీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com