‘హరి హర వీరమల్లు’ షూటింగ్‌కి రంగం సిద్ధం.!
- September 19, 2024
డిప్యూటీ సీఎంగా అధికారం చేపట్టిన తర్వాత పవన్ కల్యాణ్ తొలిసారి ముఖానికి రంగు వేసుకోబోతున్నారు. నిజానికి ఈ పాటికే పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్స్‌లో పాల్గొనాల్సి వుంది.
కానీ, అధికారం చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు అనుకూలంగా లేవు. వరదల కారణంగా ప్రభుత్వం అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. తద్వారా పవన్ కళ్యాణ్ షూటింగ్స్‌కి అటెండ్ కావడం ఆలస్యమైంది.
ఇక ఇప్పుడు ఆ టైమ్ వచ్చిందని తెలుస్తోంది. త్వరలోనే డేట్స్ కేటాయించబోతున్నారట. ఆ క్రమంలోనే ఆయన ఆల్రెడీ స్టార్ట్ చేసిన ‘హరి హర వీరమల్లు’, ‘ఓజీ’ సినిమాల్నిపూర్తి చేయనున్నారట.
‘హరి హరవీరమల్లు’ సినిమాకి సంబంధించిన సెట్స్‌ని విజయవాడ చుట్టు ప్రక్కల ఏర్పాటు చేస్తున్నారట. అలాగే ‘ఓజీ’ షూటింగ్ కూడా అదే పరిసర ప్రాంతాల్లో కానిచ్చేయనున్నారట.
రాజకీయ కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయం లేకుండా పవన్ కళ్యాణ్ ఈ రెండు సినిమాల్నీ పూర్తి చేసేందుకు టీమ్ గ్రౌండ్ వర్క్ సిద్ధం చేస్తోందట.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..