శర్వానంద్ సైలెంట్ అయిపోయాడేం.!

- September 19, 2024 , by Maagulf
శర్వానంద్ సైలెంట్ అయిపోయాడేం.!

మినిమమ్ గ్యారంటీ హీరోల్లో శర్వానంద్ ఒకడు. ఒకప్పుడు విలక్షణ కథల్ని ఎంచుకునే శర్వానంద్ ‘రన్ రాజా రన్’ సినిమాతో ట్రాక్ మార్చేశాడు.

కామెడీ హీరో అవతారమెత్తాడు. సక్సెస్‌లూ చవి చూశాడు. అయితే వివాహానంతరం శర్వానంద్ కెరీర్ స్లో అయ్యింది. పెళ్లి తర్వాత పెద్దగా కొత్త ప్రాజెక్టులేమీ సైన్ చేసినట్లు లేడు.

ఇక, రీసెంట్‌గా వచ్చిన ‘మనమే’ని డిజాస్టర్ అనాలో, ఫెయిల్యూర్ అనాలో తెలియని పరిస్థితి. ధియేటర్లలో రిలీజైంది కానీ, నెలలు గడుస్తున్నా.. ఈ సినిమా ఎందుకో ఓటీటీలో రిలీజ్ కాలేదు. నిర్మాతల మధ్య గొడవలే ఇందుకు కారణంగా చెబుతున్నారు.

చిన్న సినిమాలు సైతం ఓటీటీలో ఈజీగా రిలీజ్ అవుతున్నాయ్. ధియేటర్లలో చెప్పుకోదగ్గ ఆదరణ పొందలేకపోయినప్పటికీ, ఓటీటీ ప్రేక్షకులు నచ్చితే బ్రహ్మరధం పడుతున్నారు.

అలాంటిది శర్వానంద్ సినిమా ఓటీటీలో ఇంతవరకూ రాకపోవమేంటో అర్ధం కావడం లేదు. ఆ సంగతి అటుంచితే, శర్వా కొత్త ప్రాజెక్ట్ సంపత్ నంది దర్శకత్వంలో వుండబోతోందనీ తెలుస్తోంది. ఇంత స్లోగా వుంటే కష్టమే మరి, శర్వా కాస్త స్పీడు పెంచాలని ఆయన అభిమానులు సూచిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com