ముదురుతున్న తిరుపతి లడ్డూ వివాదం..చంద్రబాబు సీరియస్
- September 19, 2024
తిరుపతి లడ్డూ వివాదంపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'తిరుపతి వెంకటేశ్వర స్వామి హిందువులకు కలియుగ దేవుడు. అలాంటి వెంకటేశ్వర స్వామికి అపచారం తలపెడితే ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తారు. ప్రసాదంలో అపవిత్రమైన ముడిసరుకులు వాడారు. ఈ దుర్మార్గులను ఏం చేయాలో తెలియడం లేదు. ఆధారాలు దొరికితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. రాజకీయ ప్రయోజనాల కోసం దేవుడిని వాడుకోవద్దు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించొద్దు. ఇప్పటికే టీటీడీ లో ప్రక్షాళన ప్రారంభించాం. పవిత్రమైన తిరుమలను అపవిత్రం చేశారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు' అని చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
అన్నదానంలోనూ నాసిరకం సరుకులు వాడారని మండిపడ్డారు. కాగా, గత వైసీపీ సర్కారు హయాంలో తిరుపతి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా.. ఆవు నెయ్యిలో సోయాబీన్, పొద్దు తిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తి గింజలు వాడినట్లు రిపోర్టులో బయటపడింది. దీంతో పాటు చేప నూనె, బీఫ్ కొవ్వు, పామాయిల్, పంది కొవ్వు కూడా ఇందులో వాడినట్లు నివేదికలో స్పష్టమైంది. దీంతో చంద్రబాబు స్పందించి.. గత వైసీపీ సర్కార్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..