ఐరాస తీర్మానాన్ని స్వాగతించిన ఒమన్..!!

- September 20, 2024 , by Maagulf
ఐరాస తీర్మానాన్ని స్వాగతించిన ఒమన్..!!

మస్కట్: తూర్పు జెరూసలేంతో సహా ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లో ఇజ్రాయెల్ విధానాలపై అంతర్జాతీయ న్యాయస్థానం జారీ చేసిన ముసాయిదా తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించడాన్ని ఒమన్ సుల్తానేట్ స్వాగతించింది.  “పాలస్తీనా ప్రజల హక్కులకు మద్దతు ఇవ్వడంలో ఈ నిర్ణయాన్ని ఓమన్ సుల్తానేట్ ఒక కీలకమైన చర్యగా పరిగణించింది. ముఖ్యంగా వారి స్వయం నిర్ణయాధికారం, తూర్పు జెరూసలేంతో 1967 సరిహద్దులలో వారి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించడం." అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇజ్రాయెల్ ఆక్రమణను అంతం చేయడానికి, మధ్యప్రాచ్య ప్రాంతంలో న్యాయమైన సమగ్రమైన శాంతిని సాధించడానికి దోహదపడే విధంగా అంతర్జాతీయ చట్టం, సంబంధిత ఐక్యరాజ్యసమితి తీర్మానాల సూత్రాలకు అంతర్జాతీయ సమాజం కట్టుబడి ఉండవలసిన అవసరాన్ని ఒమన్ సుల్తానేట్ తెలియజేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com