తిరుమల లడ్డూ వివాదం..హైకోర్టులో వైసీపీ పిటిషన్
- September 20, 2024అమరావతి: తిరుమల లడ్డూ చుట్టూ రాజకీయాలు వేడెక్కాయి. ఈ వేడి ఇప్పట్లో చల్లారేలా లేదు. నిజం ఏంటో చెప్పాలని భక్తులు కోరుతున్నారు. ఈ విషయం ప్రతీ ఒక్కర్నీ కదిలిస్తోంది. నిన్న, మొన్న ఏపీ సీఎం చంద్రబాబు.. తిరుమల లడ్డూ, ప్రసాదాలపై చేసిన వ్యాఖ్యలు.. వైసీపీనీ, గత వైసీపీ ప్రభుత్వ పాలననూ టార్గెట్ చేస్తున్నట్లుగా ఉండటంతో.. ఆ పార్టీ అలర్ట్ అయ్యింది. దీనిపై న్యాయపరంగా తేల్చుకునేందుకు.. లడ్డూ వివాదంపై హైకోర్టులా ఆ పార్టీ లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సిట్టింగ్ జడ్డి హైకోర్టు కమిటీతో విచారణ జరిపించాలని పిటిషన్‌లో వైసీపీ కోరింది. ఐతే.. ఇతరత్రా చాలా కేసుల విచారణలు పెండింగ్‌లో ఉండటంతో.. హైకోర్టు ఈ పిటిషన్‌పై విచారణను
బుధవారం అంటే.. మరో 5 రోజులు ఉంది. ఈ ఐదు రోజుల్లో ఈ వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుందో చెప్పలేం. అటు రాజకీయ పార్టీల నేతలు, ఇటు సామాన్య ప్రజలు, పండితులు, ఆచార్యులు ఇలా ప్రతీ ఒక్కరూ దీనిపై స్పందిస్తున్నారు. వైసీపీ నేతలు ప్రసాదంలో ఎలాంటి కలుషితం జరగలేదని అంటుంటే.. పాలకపక్షం జరిగిందని అంటోంది. ఇలా ఈ అంశం ఏపీ రాజకీయాల్ని కుదిపేస్తోంది.
బుధవారం సీఎం చంద్రబాబు.. శాసన సభా పక్ష సమావేశంలో.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ, అన్న ప్రసాదాల్లో నాశిరకం, కల్తీ నెయ్యి, జంతువుల కొవ్వు వాడారని అనడంతో ఈ దుమారం రేగింది. ఆ తర్వాత టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణా రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి.. ఒక ల్యాబ్ రిపోర్టును చూపించారు. తిరుమలలో వాడుతున్న నెయ్యిని శాంపిల్ కోసం పంపించగా.. అందులో బీఫ్ టాల్లో ఉందని తేలిందని అన్నారని PTI రిపోర్ట్ చేసింది.
బీఫ్ టాల్లో అనేది ఓ రకమైన కొవ్వు. దీన్ని మనం గొడ్డు మాంసం కొవ్వు అనవచ్చు. ఈ కొవ్వును సాధారణంగా వంటలు, సబ్బుల తయారీ, కొవ్వొత్తుల తయారీ, ల్యూబ్రికెంట్స్ తయారీలో వాడుతారు. ఐతే.. దీన్ని లడ్డూ ప్రసాదాల్లో వాడారనేది తాజా వివాదం. ఈ క్రమంలో ఈ ల్యాబ్ రిపోర్ట్ ఏంటి అనే ప్రశ్న తెరపైకి వచ్చింది.
ఆనం చెప్పినది.. గుజరాత్‌లో ఉన్న లైవ్‌స్టాక్ ల్యాబొరేటరీ. ఇది దేశవ్యాప్తంగా పేరున్న ల్యాబొరేటరీ అని టీడీపీ చెబుతోంది. దీనికి నెయ్యి శాంపిల్‌ని TTD ఇవ్వగా.. బీఫ్ టాల్లో ఆ శాంపిల్‌లో ఉన్నట్లు తేలిందని ఆయన అన్నారు. అంతేకాదు.. ఆ ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం.. ఆ నెయ్యిలో.. లార్డ్ (Lard అంటే పంది కొవ్వు), ఫిష్ ఆయిల్ (చేప నూనె).. కూడా ఉందని తెలిపింది. ఈ నెయ్యి శాంపిల్‌ని జులై 9, 2024లో ఇవ్వగా.. రిపోర్టును జులై 16, 2024లో ఇచ్చింది. ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ దీనిపై స్పందిస్తూ.. ల్యాబ్ రిపోర్టులను బట్టీ.. లడ్డూ తయారీలో.. బీఫ్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ వాడినట్లు స్పష్టమైందని అన్నారు.
ఆ ల్యాబొరేటరీ పేరు CALF (సెంటర్ ఫర్ ఎనాలసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైవ్‌స్టాక్ అండ్ ఫుడ్). ఇది రకరకాలుగా విశ్లేషణలు చెయ్యగల ల్యాబ్. ఇది గుజరాత్, ఆనంద్ లోని NDDB (నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డు) దగ్గర ఉంది.
తాజాగా టీటీడీ ఈఓ శ్యామల రావు తిరుమల లడ్డూ ప్రసాదంపై మాట్లాడారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి వాడే నెయ్యిలో వనస్పతి అవశేషాలు మాత్రమే ఉన్నాయన్నారు. నెయ్యి శాంపిల్స్‌ని టెస్టింగ్ కోసం ల్యాబ్‌కి పంపగా.. వెజిటబుల్ ఫ్యాట్స్ మాత్రమే ఉన్నాయని తేలిందని అన్నారు. ఇలా ఈ వివాదం మలుపులు తిరుగుతోంది. విషయం హైకోర్టు దాకా వెళ్లింది కాబట్టి.. త్వరలోనే భక్తులకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- షార్ట్స్‌లో వీడియోల నిడివిని పెంచిన యూట్యూబ్
- కాంగో పడవ ప్రమాదంలో 78 మంది జల సమాధి
- రేపటి నుంచి భారత్–బంగ్లా టీ20 టిక్కెట్ల విక్రయం
- తిరుమల తిరుపతి శ్రీవారికి చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు
- ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వైరం ఏమిటి? ఎందుకు?
- ఇండియాకు పన్నెండు ఐఫోన్ 16 తీసుకొస్తూ.. పట్టుబడ్డ ప్రయాణికులు..!!
- అబుదాబిలో వేటాడుతూ.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ వేటగాళ్లు..!!
- సౌదీ అరేబియాలో ఇన్‌బౌండ్ విజిటర్స్ వ్యయంలో 8.2% వృద్ధి..!!
- GCC-IMF సమావేశం.. ‘ఎకనామిక్స్ ఛాలెంజెస్’పై కీలక సమీక్ష..
- ఎక్స్పో సిటీ దుబాయ్.. మాస్టర్ ప్లాన్‌కు షేక్ మహమ్మద్ ఆమోదం..!!