లడ్డు బాధ్యుల పై చర్యలు: డిప్యూటీ సీఎం పవన్
- September 20, 2024
విజయవాడ: తిరుమల లడ్డూ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ అంశంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు వినియోగించడం అందరి మనోభావాలను దెబ్బతీసిందన్నారు. వైసీపీ హయాంలో ఉన్న టీటీడీ బోర్డే దీనికి సమాధానం చెప్పాలన్నారు.ఈ సందర్భంగా సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటుపై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేవాలయాలకు సంబంధించిన పలు అంశాలను పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. ధార్మిక పద్ధతులు, అన్ని సమస్యలు పరిశీలించేందుకు జాతీయ స్థాయిలో 'సనాతన ధర్మ రక్షణ బోర్డు'ని ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దీనిపై అన్ని వర్గాల వారితో జాతీయ స్థాయిలో చర్చ జరగాలన్నారు. సనాతన ధర్మానికి ఏ రూపంలో ముప్పు వాటిల్లినా అందరూ కలిసికట్టుగా నిర్మూలించాలన్నారు.
తాజా వార్తలు
- మిలియన్ల మోసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో OMR 79.8 మిలియన్లకు చేరిన ఇన్సూరెన్స్ చెల్లింపులు..!!
- 11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!
- జాతీయ దినోత్సవ వేడుకలకు భద్రతా కట్టుదిట్టం..!!
- కటారాలో ప్రయాణంలో రమదాన్ ఇఫ్తార్..!!
- 40 దేశాల నుండి చికెన్, గుడ్ల దిగుమతుల పై సౌదీ నిషేధం..!!
- 'వాహన్' పోర్టల్‌లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?









