‘దేవర’లో పాట కిరికిరి.!

- September 20, 2024 , by Maagulf
‘దేవర’లో పాట కిరికిరి.!

ఎన్టీయార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘దేవర’ సినిమా మరో వారం రోజుల్లో (సెప్టెంబర్ 27) రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమాకి సంబంధించి ఏదో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వార్తల్లో వుంటోంది.

ఈ సినిమాలో కేవలం నాలుగు పాటలే వున్నాయని తెలుస్తోంది. అందులో రెండు బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ కాగా, మరోటి హీరోయిన్ జాన్వీ కపూర్‌తో ‘చుట్టమల్లే..’ అంటూ సాగే రొమాంటిక్ సాంగ్.

ఇక రీసెంట్‌గా రిలీజ్ చేసిన ‘దావూది’ పాట సంగతేంటయ్యా.! అంటే అది  సినిమా ఎండ్ అయిపోయాకా టైటిల్స్‌లో స్క్రోల్ అయ్యే పాటనీ తెలుస్తోంది.

అయితే, ‘దేవర’ను రెండు పార్టులుగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అంటే మొదటి పార్ట్‌లో సినిమా అసంపూర్తిగానే ముగుస్తుంది. అలాంటప్పుడు శుభం కార్డెక్కడిది.? టైటిల్స్ సాంగ్ ఎలా వేస్తారు.. ఇలాంటి ప్రశ్నలెన్నో.

కట్ చేస్తే, అసలు ఈ సాంగ్‌ని ధియేటర్లో లేపేసే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. ప్లేస్‌మెంట్ సెట్ కాకపోవవడం వల్లనే ఈ పాటను తీసేయనున్నారనీ తెలుస్తోంది. అలాగే, రన్ టైమ్‌ విషయంలోనూ కొంత కిరికిరి నడుస్తోంది. ఈ కిరికిరులన్నింటికీ తెర పడాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com