యాక్షన్ మోడ్‌కి సిద్ధమవుతున్న ‘హరిహర వీరమల్లు’.!
- September 20, 2024
అటకెక్కేసిందనుకున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రం మళ్లీ పట్టాలెక్కుతోంది. క్రిష్ దర్శకత్వంలో స్టార్ట్ అయిన ఈ సినిమా షూటింగ్ మధ్యలో నిర్మాత ఏ.ఎమ్.రత్నం తనయుడు జ్యోతి కృష్ణ చేతికి వెళ్లింది.
అప్పట్లో క్రిష్‌కీ, పవన్ కళ్యాణ్‌కీ, కాదు కాదు నిర్మాతతో క్రిష్‌కి ఏవో అభిప్రాయ బేధాలు రావడంతో ఆయన సినిమా నుంచి తప్పుకున్నారు. దాంతో, ఏ.ఎమ్,రత్నం తనయుడు, ‘7జీ బృందావన కాలనీ’ సినిమా హీరో అయిన జ్యోతి కృష్ణ దర్శకుడి హోదాలో ఈ సినిమాని పూర్తి చేసే బాధ్యతను చేపట్టాడు.
ఆయన దర్శకత్వంలోనే ఈ సినిమా ఇప్పుడు మళ్లీ పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 23 నుంచి ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది.
ఓ బీభత్సమైన యాక్షన్ ఎపిసోడ్ ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నారట. అందుకోసం ప్రముఖ హాలీవుడ్ కొరియెగ్రఫర్లను ఎంగేజ్ చేశారట. మొగలాయిల కాలం నాటి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది ఈ సినిమాలో.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?