కిడ్నీ స్టోన్స్‌కి టమాటా ఓ కారణమా.?
- September 20, 2024
కిడ్నీలో స్టోన్స్ ఏర్పడితే కొన్ని రకాల కూరగాయల్ని తినడం మానేస్తుంటారు సహజంగా.అందులో ఒకటి టమోటా.
టమోటాలను మనం కూరగాయలుగా లెక్క చేయలేం నిజానికి. ఎందుకంటే ఏ కూరగాయ వండాలన్నా టమాటా వుండాల్సిందే. అలా, సహాయ కూరగాయగా టమాటాని వాడుతుంటాం.
గ్రేవీ కోసం కానీ, ఎక్స్‌ట్రా టేస్ యాడ్ అవ్వడానికి లేదా మంచి కలర్ రావడానికి ఇలా అనేక రకాలుగా కూరలకు ఎక్స్‌ట్రాస్ యాడ్ చేసేందుకు ఖచ్చితంగా టమాటా ఉపయోగిస్తుంటాం.
అయితే, టమాటాలు ఎక్కువగా వాడితే, కిడ్నీలో స్టోన్స్ వస్తాయన్న అపోహ చాలా మందిలో వుంది. కానీ, కిడ్నీలో స్టోన్స్ అనేవి ఆక్సలేట్ ఎక్కువగా వున్న ఆహార పదార్ధాలు తినడం వల్ల వస్తుంటాయ్.
అయితే, ఆక్సలేట్ అనేది కూరగాయల్లో సహజ సిద్ధంగా వుండేదే. అలాగే టమాటాలో కూడా ఆక్సలేట్ వుంటుంది. కానీ, అది కిడ్నీ స్టోన్స్ కలిగించేంత హానికరం కాదని నిపుణులు చెబుతున్నారు.
టమాటాలో విటమిన్ ఇ, సి, ఎ పుష్కలంగా వుంటాయ్. అలాగే, ఫైబర్ కూడా ఎక్కువ పాళ్లలో వుంటుంది. సో, ఆరోగ్యానికి టమాటా మేలు చేస్తుందే కానీ, కీడు చేయదు. అలాగే కిడ్నీ స్టోన్స్‌కి టమాటా అస్సలు కారణం కాదని నిపుణులు నొక్కి చెబుతున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?