ఇజ్రాయెల్‌ పై 140 మిస్సైల్స్ ప్రయోగించిన హిజ్బుల్లా

- September 20, 2024 , by Maagulf
ఇజ్రాయెల్‌ పై 140 మిస్సైల్స్ ప్రయోగించిన హిజ్బుల్లా

ఇజ్రాయెల్‌ పై 140 మిస్సైల్స్ ను ఈరోజు హిజ్బుల్లా ప్రయోగించింది.ఈ దాడులు ఉత్తర ఇజ్రాయెల్‌లో చోటుచేసుకున్నాయి. హిజ్బుల్లా ఉగ్రవాదులు మొత్తం మూడు దాడులు నిర్వహించారు, ఇందులో మొత్తం 140 క్షిపణులు ప్రయోగించారు. ఈ దాడుల కారణంగా జరిగిన నష్టం ఎంతనేది ఇంకా తెలియరాలేదు.

ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. లెబనాన్‌లోని హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్‌పై ఈ దాడులు చేసింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్) ఈ దాడులకు ప్రతీకారంగా హిజ్బుల్లా స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించింది.
ఈ దాడుల కారణంగా ఇరువైపులా ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. ఇజ్రాయెల్ తన దేశాన్ని రక్షించుకోవడానికి హిజ్బుల్లా మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తోంది.

ఈ పరిణామాలు ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. ఇరువైపులా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ సంఘటనలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

--వేణు పెరుమాళ్ళ(మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com