బహ్రెయిన్ కు జూలైలో పోటెత్తిన విజిటర్స్.. 3 మిలియన్లకు పైగా రాక..!!
- September 21, 2024
మనామా: జూలైలో బహ్రెయిన్ పెద్ద సంఖ్యలో విజిటర్స్ కు స్వాగతం పలికింది. దాదాపు 3.3 మిలియన్ల మంది వివిధ ఎంట్రీ పాయింట్ల ద్వారా ప్రయాణించారు. బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం, కింగ్ ఫహద్ కాజ్వే, బహ్రెయిన్ ఓడరేవుల ద్వారా దేశంలోకి వచ్చివెళ్లినట్లు అధికారిక నివేదిక వెల్లడించింది.ముఖ్యంగా బహ్రెయిన్‌ను సౌదీ అరేబియాకు కలిపే కింగ్ ఫహద్ కాజ్వే అత్యంత రద్దీగా ఉండే ప్రవేశ ప్రదేశంగా పేర్కొన్నారు. జూలైలో 1,407,970 మంది ప్రయాణికులు కాజ్వే ద్వారా బహ్రెయిన్‌లోకి ప్రవేశించగా, 1,427,189 మంది ప్రయాణికులు కాజ్వే ద్వారా బహ్రెయిన్‌ను విడిచి వెళ్లారు. బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా 223,784 మంది ప్రయాణికులు బహ్రెయిన్‌కు చేరుకోగా, 247,564 మంది ప్రయాణికులు బహ్రెయిన్ నుండి వెళ్లారు. ఓడరేవుల ద్వారా 1,856 మంది ప్రయాణికులు బహ్రెయిన్‌లోకి ప్రవేశించగా, 1,892 మంది ప్రయాణికులు బహ్రెయిన్ నుంచి బయలుదేరారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!