అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ తో భేటీ అయిన ప్రధాని మోదీ

- September 22, 2024 , by Maagulf
అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ తో భేటీ అయిన ప్రధాని మోదీ

అమెరికా: ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల అమెరికా పర్యటన విజయవంతంగా కొనసాగుతుంది. శనివారం అమెరికా చేరుకున్న మోదీ.. డెలావేర్ లో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం న్యూయార్క్ కు చేరుకున్న ప్రధానికి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. అక్కడ జరనున్న కమ్యూనిటీ ఈవెంట్ లో మోదీ పాల్గోనున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఆయన సతీమణి, అమెరికా ప్రథమ అధ్యక్షురాలు జిల్ బిడెన్ కు ప్రత్యేకమైన బహుమతులు అందజేశారు.

అమెరికా పర్యటనలో భాగంగా డెలావేర్ లోని జో బిడెన్ నివాసంలో ఇద్దరు నేతలు సమావేశం అయ్యారు. ఇందులో భాగంగా పలు అంశాలపై వీరిద్దరూ చర్చించారు. అనంతరం జో బిడెన్ కు మోదీ వెండితో చేసిన రైలు నమూనాను బహుమతిగా అందజేశారు. రైలు బండిపై ఢిల్లీ టూ డెలావేర్ అని రాసి ఉంది. అదేకాకుండా.. ఇంజిన్ వైపు ఇండియన్ రైల్వే అని రాసి ఉంది. దీనిని మహారాష్ట్రకు చెందిన కళాకారులు తయారు చేసినట్లు తెలిపారు. అదే సమయంలో అమెరికా ప్రథమ మహిళ జిల్ బిడెన్ కు కూడా ప్రధాని మోదీ బహుమతి అందజేశారు.

పేపియర్ మాచే బాక్స్ లో పష్మీనా శాలువాలను జిల్ బిడెన్ కు మోదీ బహుకరించారు. నాణ్యతల కలిగిన పష్మీనా శాలువా జమ్మూకాశ్మీర్ లో తయారు చేయించారు. ఇక్కడి శాలువాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉంది. లడఖ్ లోని చాంగ్తాంగి ప్రాంతం నుంచి ఈ శాలువాల ప్రస్థానం ప్రారంభమైంది. ఈ శాలువాలను మృదువైన పైబర్ తో ప్రత్యేకంగా తయారు చేసిన నూలుతో తయారు చేస్తారు. ఈ నూలు తయారీ పద్దతి కూడా భిన్నంగా ఉంటుంది. వీటిని ప్రత్యేక నైపుణ్యం కలిగిన కళాకారులు తరతరాలుగా వస్తున్న సంప్రదాయ పద్దతులను ఉపయోగించి చేతితో మాత్రమే నూలుగా మారుస్తారు. వివిధ మొక్కలు, ఖనిజాలతో తయారు చేసిన సహజ రంగులను మాత్రమే పష్మీనా శాలువాల తయారీలో వినియోగిస్తారు. అందుకే పష్మీనా శాలువాలను మన దేశ వారసత్వ వస్తువులుగా పరిగణిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com