శ్రీలంక అధ్యక్షునిగా అనురకుమార విజయం
- September 22, 2024
కొలంబో: శ్రీలంక నూతన అధ్యక్షుడిగా అనుర కుమార దిసనాయకే ఎన్నికయ్యారు. ఈ మేరకు శ్రీలంక ఎన్నికల సంఘం ఆదివారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. రణిల్ విక్రమ సింఘేను దిసనాయకే ఓడించారు. అనుర కుమార దిసనాయకే(56), సామాన్య కుటుంబ నేపథ్యం నుంచి శ్రీలంక రెండో అధ్యక్షుడు అయ్యారు. ఆయన తండ్రి వ్యవసాయ కూలీ.
శనివారం జరిగిన ఎన్నికలలో 55 ఏళ్ల దిసనాయకే 42.31 శాతం ఓట్లతో అధ్యక్షుడిగా గెలిచారని ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో వెల్లడించింది. దిసనాయకే.. ప్రతిపక్షనాయకుడు సజిత్ ప్రేమదాసును రెండవ స్థానానికి, విక్రమ సింఘేను మూడవ స్థానానికి నెట్టేశారు. అనుర కుమార దిసనాయకే సోమవారం (సెప్టెంబర్ 23న) శ్రీలంక నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
తొలుత విజయానికి అవసరమైన 50 శాతానికిపైగా ఓట్లు ఏ అభ్యర్థికీ రాలేదు. దీంతో గెలుపును నిర్ధరించే రెండో రౌండ్ కౌంటింగ్ చేపట్టారు. ఇందులో మార్కిస్ట్ నేత కుమార దిసనాయకే విజయం సాధించారు. 'పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ 55 ఏళ్ల నాయకుడు అనుర కుమార డిస్సనాయకే శనివారం జరిగిన ఎన్నికలలో 42.31% ఓట్లతో అధ్యక్ష పదవిని గెలుచుకున్నారు' అని ఎన్నికల సంఘం ఆదివారం ప్రకటించింది. ఇక, ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస 32.76%తో రెండో స్థానంలో నిలిచారు. 2022 ఆర్థిక పతనం గరిష్ట సమయంలో పదవీ బాధ్యతలు స్వీకరించిన, IMF బెయిలౌట్ నిబంధనల ప్రకారం కఠినమైన పొదుపు విధానాలను విధించిన పదవీ విరమణ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే..17.27%తో మూడవ స్థానంలో నిలిచారు. ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే తొలి రౌండులోనే పోటీ నుంచి వైదొలిగారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!