శ్రీవారి లడ్డూ కల్తీ వివాదం.. ప్రమాణం చేస్తుండగా భూమనను అడ్డుకున్న పోలీసులు
- September 23, 2024
తిరుమల: శ్రీవారి లడ్డూ కల్తీ వివాదం మరింత రాజుకుంటోంది. శ్రీవారిని సన్నిధిలో టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేస్తుండగా పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. రాజకీయ వ్యాఖ్యలు చేయకూడదని భూమనకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.
తన తప్పేమీ లేదంటూ తిరుమల శ్రీవారి ఆలయంలో భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేయడానికి వెళ్లారు. అంతకుముందు ఆయన పుష్కరిణీలో పవిత్ర స్నానం చేశారు. అలాగే, అఖిలాండం వద్ద కర్పూర నీరాజనం అందించచి, ఆ తర్వాత స్వామి వారి ఆలయం ఎదుటకు వెళ్లారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ఆయనను పోలీసులు అడ్డుకున్నారు.
భూమన మాట్లాడుతూ.. కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాల వల్ల తన మనసు కలత చెందుతోందని అన్నారు. శ్రీవారి కేంద్రంగా రాజకీయాలు మాట్లాడటం నిషిద్ధమని చెప్పారు. కొందరు దారుణంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. తాను తప్పు చేసి ఉంటే తన కుటుంబం సర్వ నాశనం అయిపోవాలని అన్నారు. తాను ఏ రాజకీయ మాట మాట్లాడలేదని భూమన అన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







