మహారాష్ట్రలో బస్సు ప్రమాదం..నలుగురు మృతి, 30 మందికి గాయాలు

- September 23, 2024 , by Maagulf
మహారాష్ట్రలో బస్సు ప్రమాదం..నలుగురు మృతి, 30 మందికి గాయాలు

మహారాష్ట్ర: మహారాష్ట్రలో పరత్వాడీ ధాని మార్గంలోని సెమడోహ్ సమీపంలో సోమవారం ఉదయం మెల్‌ఘాట్‌లో మలుపులు తిరుగుతున్న రహదారిపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఒక ప్రైవేట్ బస్సు సమీపంలోని వంతెన కింద పడిపోవడంతో ప్రమాదం జరిగింది. కలెక్టర్ సౌరభ్ కతియార్ సమాచారం మేరకు ఈ ఘటనలో 30 మంది ప్రయాణికులు గాయపడగా నలుగురు మరణించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురు వ్యక్తులను సమీపంలోని సెమడోహ్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com