యూఏఈ వీసా క్షమాభిక్ష.. పాస్‌పోర్ట్ చెల్లుబాటు గడువు నెల రోజులకు తగ్గింపు..!!
- September 25, 2024
అబుదాబి: వీసా క్షమాభిక్ష గ్రేస్ సమయంలో ఉల్లంఘించిన వారి స్థితిని మార్చేందుకు పాస్ పోర్టు గడువును 6 నెలల నుండి ఒక నెలకు తగ్గించాలని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజెన్‌షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ (ICP) నిర్ణయించింది. ఈ మేరకు పాస్‌పోర్ట్ చెల్లుబాటు వ్యవధిని సవరించనుంది. రెసిడెన్సీ, వీసా ఉల్లంఘించినవారు, దేశంలోని విదేశాల్లో జన్మించిన పిల్లలు, అడ్మినిస్ట్రేటివ్ లిస్ట్‌లో ఉన్నవారి పాస్‌పోర్ట్‌ల చెల్లుబాటు వ్యవధిని ఆరు నెలల నుంచి ఒక నెలకు సవరించినట్టు అథారిటీ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ సుహైల్ సయీద్ అల్ ఖైలీ తెలిపారు. దేశంలో ఉన్న రాయబార కార్యాలయాల ద్వారా పాస్‌పోర్ట్‌లను పునరుద్ధరించుకోవచ్చని సూచించారు.పాస్‌పోర్ట్ చెల్లుబాటు వ్యవధిని సవరించాలనే నిర్ణయం..గ్రేస్ పీరియడ్ లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలకు సరైన పరిష్కారాలను అందిస్తుందన్నారు. మరింత సమాచారం కోసం అథారిటీ యొక్క కాల్ సెంటర్‌ను సంప్రదించాలని సూచించారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!