ఈ సారి టీ20 ప్రపంచ కప్ గెలుస్తాం: హర్మన్‌ప్రీత్ కౌర్
- September 25, 2024
యూఏఈ వేదికగా మహిళల టీ20 వరల్డ్ కప్ 2024 జరగనుంది. వచ్చే నెల 3 నుంచి అంటే.. మరో 9 రోజుల్లో ఈ మెగా కప్‌కు తెరలేవనుంది. ఈ మెగా ఈవెంట్‌కు సన్నద్ధమైన భారత మహిళల జట్టు టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగుతున్నది. ఇప్పటివరకు ఒక్కసారి కూడా టీ20 ప్రపంచకప్ గెలవని టీమిండియా టైటిల్ నిరీక్షణకు తెరదించాలని చూస్తున్నది. ఈ సారి కచ్చితంగా టైటిల్ గెలుస్తామని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ దీమా వ్యక్తం చేసింది.యూఏఈకి బయల్దేరే ముందు మంగళవారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరన్స్‌లో హర్మన్‌ప్రీత్.. పలు విషయాల గురించి మాట్లాడింది. ‘ఈ సారి టైటిల్ ఎత్తడానికి ఏం కావాలో అన్నీ మా దగ్గర ఉన్నాయి. 2020లో ఫైనల్‌కు చేరుకున్నాయి. గతేడాది తృటిలో ఫైనల్‌ను మిస్ అయ్యాం. అతిపెద్ద వేదికపై మేము ఏ విధంగా సత్తాచాటుతున్నామో చెప్పడానికి ఇదే నిదర్శనం. జట్టుపై నాకు పూర్తి నమ్మకం ఉంది. వాళ్లు ఏం చేయగలరో, వాళ్ల సామర్థ్యమేంటో నాకు తెలుసు. పేసర్లు పూజ వస్త్రాకర్, రేణుక సింగ్ ఫామ్‌లో ఉన్నారు. ఆల్‌రౌండర్ అరుంధతి రెడ్డి జట్టు కోసం ఎల్లప్పుడూ బ్యాటింగ్, బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉంది’ అని తెలిపింది.అలాగే, తాను 19 ఏళ్ల వయసులో తొలి టీ20 ప్రపంచకప్ ఆడినప్పుడు ఏ విధంగా ఉత్సాహంగా ఉన్నానో, ఇప్పుడూ అదే ఉత్సాహంతో ఉన్నానని తెలిపింది. అయితే, ఇప్పుడు అనుభవం కూడా తోడైందని, ఒత్తిడిని ఎలా అధిగమించాలో తెలుసునని చెప్పింది. ఫలితాలతో సంబంధం లేకుండా స్వేచ్ఛగా ఆడటంపైనే దృష్టి పెట్టానని, స్వేచ్ఛగా ఆడుతూ క్రికెట్‌ను ఆస్వాదిస్తే తాను చాలా విషయాలను మార్చగలనని చెప్పుకొచ్చింది. యూఏఈ పరిస్థితుల గురించి మాట్లాడుతూ..‘చాలా వరకు మ్యాచ్‌లు రాత్రి జరగనున్నాయి. కాబట్టి, మంచు ప్రభావం ఉంటుంది. మాకు మంచి స్పిన్నర్లతోపాటు పూజ, రేణుక ఉన్నారు’ అని తెలిపింది.
తాజా వార్తలు
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్
- ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్
- డిసెంబర్ 11-12 తేదీల్లో కెనడాలో ప్రధాని మోదీ పర్యటన
- ఉద్యోగుల పాస్‌పోర్టులు ఇవ్వకపోతే QR25,000 జరిమానా..!
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నేరుగా వెళ్లొచ్చు..!
- కువైట్‌లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..తేలికపాటి వర్షాలకు అవకాశం..!
- వృద్ధాప్యం, మెదడు వ్యాధులపై పరిశోధనకు సౌదీ అంతరిక్ష ప్రయోగం..!!
- 12 ఏళ్లకే నిత్య తమ్మనకు అంతర్జాతీయ పురస్కారం!
- సౌదీ అరేబియాలో స్థిరంగా ద్రవ్యోల్బణం..!!
- ఖర్జూర సాగు అభివృద్ధిపై అంతర్జాతీయ సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!







