బహ్రెయిన్ లో $8bln రవాణా ప్రాజెక్ట్ విస్తరణ..ఆర్థిక వృద్ధికి దోహదం..!!
- September 26, 2024
మనామా: బహ్రెయిన్ $8 బిలియన్ల రవాణా ప్రాజెక్ట్ ను విస్తరించనుంది.ఇందులో భాగంగా $2 బిలియన్లతో బహ్రెయిన్ మెట్రో ప్రాజెక్ట్, కింగ్ హమద్ కాజ్‌వే వంటి కీలక కార్యక్రమాలతో ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరచడానికి ప్రణాళికలు రూపొందించారు. ఈ మేరకు మోర్డోర్ ఇంటెలిజెన్స్ ఒక నివేదిక విడుదల చేసింది. ఈ విస్తరణ బహ్రెయిన్ విజన్ 2030లో భాగమని, విస్తృతమైన పెట్టుబడులకు ఇది దోహదం చేస్తుందన్నారు. 2021 ఆర్థిక పునరుద్ధరణ ప్రణాళికలో భాగంగా $30 బిలియన్ల కంటే ఎక్కువ విలువైన 22 వ్యూహాత్మక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించారు. వీటిలో ఐదు కృత్రిమ ద్వీపాలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా అభివృద్ధి చేస్తున్నారు.
యూఏఈ, టర్కీకి చెందిన సంస్థలతో కూడిన జాయింట్ వెంచర్ అయిన Arabtec TAVకి $1.1 బిలియన్ల ప్రాజెక్ట్.. బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆధునికీకరణను చేపట్టనున్నారు. అదే సమయంలో సౌదీ అరేబియాతో కింగ్ ఫహద్ కాజ్‌వేకి సమాంతరంగా నడిచే కొత్త రైలు, రోడ్డు లింక్ అయిన కింగ్ హమద్ కాజ్‌వేపై నిర్మాణం చేపడుతున్నారు. బహ్రెయిన్ మెట్రో109-కిలోమీటర్ల తేలికపాటి రైలు నెట్‌వర్క్‌ను కలిగి ఉందని నివేదికలో వెల్లడించారు.
తాజా వార్తలు
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..
- ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీకి ‘Z’ కేటగిరీ భద్రత
- భారత్ టారిఫ్‌ల పై ట్రంప్‌కు అమెరికాలోనే వ్యతిరేకత
- ఏపీ: 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు
- భారత్ కు చేరుకున్న ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ
- గడువు ముగిసిన పదార్థాలు.. రెస్టారెంట్ యజమానికి జైలుశిక్ష..!!
- ఖతార్ లో కొత్త తరం వాహన లైసెన్స్ ప్లేట్లు..!!
- వాతావరణ ప్రమాదాలు, సునామీపై జాతీయ అవగాహన..!!







