చట్టవిరుద్ధంగా వెబ్‌సైట్‌లలో కోల్డ్‌ప్లే టిక్కెట్‌లు..అధిక ధరలకు విక్రయం.. హెచ్చరికలు జారీ..!!
- September 26, 2024
యూఏఈ: అబుదాబిలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కోల్డ్‌ప్లే షో కోసం కొన్ని టిక్కెట్‌లు, ప్రీమియం కేటగిరీ కోసం మొదట ధర Dh995, ఇప్పుడు Viagogo వంటి అనధికార వెబ్‌సైట్‌లలో దాదాపు Dh20,000కి మళ్లీ విక్రయిస్తున్నారు. సెప్టెంబరు 25 టిక్కెట్ల ప్రీ-సేల్‌కు ముందు కచేరీకి వెళ్లేవారికి నిర్వాహకులు కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు.
గ్రామీ అవార్డ్-విజేత బ్యాండ్ మ్యూజిక్ ఆఫ్ ది స్పియర్స్ వరల్డ్ టూర్ 2025లో భాగంగా జనవరి 11, 2025న జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో ప్రదర్శన నిర్వహిస్తున్నారు. డిమాండ్ కారణంగా బ్యాండ్ అదే వేదిక వద్ద రెండవ కాన్సర్ట్ షెడ్యూల్ ప్రకటించింది. దాంతో టిక్కెట్లకు డిమాండ్ అధికంగా ఉంది. అధికారిక టికెటింగ్ ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌మాస్టర్, వయాగోగో, స్టబ్‌బ్, గ్రిన్‌థబ్, డుబిజిల్ వంటి అనధికార రీసెల్లర్‌ల నుండి కొనుగోలు చేసిన టిక్కెట్‌లు ఎంట్రీకి చెల్లుబాటు కావని రద్దు చేస్తామని హెచ్చరించింది. అయినా రీ సేల్ ఆగడం లేదు. Dh295 ధర కలిగిన సాధారణ అడ్మిషన్ స్టాండింగ్ టికెట్ ఇప్పుడు Dh1,849 పలుకుతోంది. Dh695 రూబీ కేటగిరీ టికెట్ వయాగోగోలో Dh4,407 అందుబాటులో ఉంది.ఇండియాలో కోల్డ్‌ప్లే కచేరీ కోసం VIP టిక్కెట్‌లు వయాగోగోలో Dh27,000(అసలు ధర Dh1,537.48)కి విక్రయిస్తున్నారు. వయాగోగో, గిగ్స్‌బర్గ్ వంటి పునఃవిక్రయ ప్లాట్‌ఫారమ్‌లలో రూ. 2,500 (దిర్హాన్109.82) ధర ఉన్న స్టాండర్డ్ టిక్కెట్‌లు కూడా రూ.15,000 (దిర్హాం 658.93) వరకు మళ్లీ విక్రయించబడుతున్నాయి. VIP టిక్కెట్లను రూ.35,000 (సుమారు Dh1,537)కి కొనుగోలు చేసిన వ్యక్తులు వాటిని అత్యధికంగా రూ.300,000 (Dh13,178)కి మళ్లీ విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, నిర్వాహకుల వ్రాతపూర్వక అనుమతి లేకుండా టిక్కెట్లను తిరిగి విక్రయించడం యూఏఈలో చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..